బాహుబలి సిరీస్ సినిమాల కోసం అన్ని కోట్ల అప్పు చేశారా.. వడ్డీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాలకు ఊహించని స్థాయిలో ఖర్చైంది.ఆర్కా మీడియా బ్యానర్ పై బాహుబలి, బాహుబలి2( Baahubali 2 ) తెరకెక్కగా ఈ రెండు సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.

అయితే ఈ సినిమా కోసం నిర్మాతలు 400 కోట్ల రూపాయలు అప్పు చేశారని రానా చెప్పుకొచ్చారు.

బాహుబలి సిరీస్ సినిమాల కోసం చేసిన అప్పు గురించి రానా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.

మూడు నాలుగేళ్ల క్రితం సినిమాలకు డబ్బులు కావాలంటే నిర్మాత తన ఇంటి నుంచి డబ్బులు తెచ్చేవాడ ని లేదా బ్యాంకులలో ఆస్తులను తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తెచ్చేవాడని రానా తెలిపారు.

మేము అప్పట్లో 24 నుంచి 28 శాతం వడ్డీ కట్టేవాళ్లమని ఆయన పేర్కొన్నారు.

"""/" / సినిమా ఇండస్ట్రీలో అప్పులు అంటే అంత వడ్డీతో ఉండేవని రానా చెప్పుకొచ్చారు.

బాహుబలి, బాహుబలి2 సినిమాల కోసం 300 నుంచి 400 కోట్ల రూపాయలు 24 శాతం వడ్డీకి అప్పు తెచ్చామని ఆయన కామెంట్లు చేశారు.

బాహుబలి1( Baahubali ) షూట్ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఆ సమయంలో వడ్డీకి 180 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగిందని రానా చెప్పుకొచ్చారు.

"""/" / బాహుబలి2 సినిమా రిజల్ట్ తేడా కొట్టి ఉంటే అ పరిస్థితిని ఊహించుకోవడమే కష్టమని రానా కామెంట్లు చేశారు.

బాహుబలి బడ్జెట్ గురించి కొంతకాలం క్రితం జక్కన్న కూడా స్పందించి షాకింగ్ కామెంట్లు చేశారు.

తమను నమ్మి నిర్మాతలు భారీ మొత్తంలో అప్పులు చేసి నిర్మిస్తారని సినిమా ఫ్లాపైతే నిర్మాత కోలుకోలేని పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

బాహుబలి, బాహుబలి2 సినిమాల కోసం నిర్మాతలు తీసుకున్న రిస్క్ వల్లే ప్రస్తుతం ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు తేజం చిన్నారి కలశకు ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు