నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో స్కంద మూవీ సరికొత్త రికార్డ్.. ఏకంగా ఇన్ని రూ.కోట్లా?

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హీరో రామ్( Ram Pothineni ) నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

వరుస ఫ్లాపులు రామ్ మార్కెట్ ను తగ్గించాయి.అయితే అఖండ సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్షన్ లో రామ్ నటించడంతో స్కంద సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 50 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయి.

రామ్ సినిమా థియేట్రికల్ హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడవడంలో ఆశ్చర్యం లేకపోయినా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమాకు ఏకంగా 98 కోట్ల రూపాయలు వచ్చాయి.

దాదాపుగా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

స్కంద( Skanda Movie ) శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ మా గ్రూప్ కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది.

"""/" / ఈ సినిమా హిందీకి సంబంధించిన అన్ని హక్కులను జీ స్టూడియోస్( Zee Studios ) సొంతం చేసుకుంది.

జీ స్టూడియోస్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ స్థాయిలో ఆదాయం సొంతమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్కంద నాన్ థియేట్రికల్ హక్కులతో సేఫ్ అయింది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

"""/" / ఇప్పటికే స్కంద మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

థమన్ ( Thaman ) ఈ సినిమా సాంగ్స్, బీజీఎం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

రామ్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.సినిమా సినిమాకు రామ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

శోభితతో తొలి పరిచయం అక్కడే జరిగింది.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!