నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో స్కంద మూవీ సరికొత్త రికార్డ్.. ఏకంగా ఇన్ని రూ.కోట్లా?
TeluguStop.com
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హీరో రామ్( Ram Pothineni ) నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.
వరుస ఫ్లాపులు రామ్ మార్కెట్ ను తగ్గించాయి.అయితే అఖండ సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్షన్ లో రామ్ నటించడంతో స్కంద సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండటం గమనార్హం.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 50 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయి.
రామ్ సినిమా థియేట్రికల్ హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడవడంలో ఆశ్చర్యం లేకపోయినా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమాకు ఏకంగా 98 కోట్ల రూపాయలు వచ్చాయి.
దాదాపుగా 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.
స్కంద( Skanda Movie ) శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ మా గ్రూప్ కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది.
"""/" /
ఈ సినిమా హిందీకి సంబంధించిన అన్ని హక్కులను జీ స్టూడియోస్( Zee Studios ) సొంతం చేసుకుంది.
జీ స్టూడియోస్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ స్థాయిలో ఆదాయం సొంతమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్కంద నాన్ థియేట్రికల్ హక్కులతో సేఫ్ అయింది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
"""/" /
ఇప్పటికే స్కంద మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
థమన్ ( Thaman ) ఈ సినిమా సాంగ్స్, బీజీఎం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
రామ్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.సినిమా సినిమాకు రామ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
గుర్తు పెట్టుకో.. వడ్డీతో సహా తిరిగొస్తుంది.. వైరల్ అవుతున్న నయన్ సంచలన పోస్ట్!