‘స్కంద’ మూవీ మొట్టమొదటి రివ్యూ..రామ్ కెరీర్ రిస్క్ లో పడనుందా?

'అఖండ' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ఏ హీరో తో సినిమా చెయ్యబోతున్నాడు అని అందరూ అనుకుంటున్నా సమయం లో ఎనెర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తున్నాను అని ఒక అధికారిక ప్రకటన చేసి అందరినీ షాక్ కి గురి చేసాడు.

అనుకున్న సమయం కంటే ముందుగానే షూటింగ్ ని పూర్తి చేసి, ఈ చిత్రానికి 'స్కంద'( Skanda ) అనే టైటిల్ ని పెట్టాడు.

ఆ తర్వాత ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్ మరియు ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇలాంటి ఊర మాస్ సినిమాలకు మొదట్లో ఆడియన్స్ వైపు నుండి అలాంటి రెస్పాన్స్ రావడం అనేది సహజం.

ట్రైలర్ వచ్చిన తర్వాత అన్నీ సెట్ అవుతాయి అని అనుకున్నారు.అయితే ట్రైలర్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది కానీ, నార్మల్ ఆడియన్స్ కి మాత్రం రొటీన్ గా అనిపించింది.

"""/" / హీరో రామ్( Hero Ram Pothineni ) డైలాగ్ మోడ్యులేషన్ పెద్దగా బాగాలేదని, ఆయనకీ ఇలాంటి సినిమాలు సెట్ కావు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు నెటిజెన్స్.

అయితే ఏ ఈసినిమాకి సంబంధించిన ఫైనల్ కాపీ రెడీ అవ్వడం తో ప్రసాద్ ల్యాబ్స్ లో కొంత మంది సినీ ప్రముఖులు మీడియా మిత్రుల మధ్య కూర్చొని, ఈ సినిమాని చూశారట.

వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఏమిటంటే కథ చాలా రొటీన్ గానే ఉంది కానీ, టేకింగ్ మాత్రం బోయ రేంజ్ మాస్ లోనే ఉందంటూ చెప్పారట.

అయితే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఇలాంటి సినిమాలకు థియేట్రికల్ రన్ రావడం లేదు.

మొదటి ఆట నుండే నెగటివ్ టాక్( Skanda Movie First Review ) వచ్చే అవకాశం ఉంది.

మరి స్కంద కి ఎలాంటి ఫలితం వస్తుందో అని మూవీ టీం టెన్షన్ లో ఉంది.

"""/" / ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీలా( Sreeleela ) నటించగా, ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ ఐటెం సాంగ్ లో నటించింది.

'కల్ట్ మామ' అంటూ సాగే ఈ పాటని రీసెంట్ గానే విడుదల చేసారు .

ఇక ఈ చిత్రంలో విలన్ గా ప్రముఖ యంగ్ హీరో ప్రిన్స్ నటించాడు, ట్రైలర్ లో కూడా ఇతను కనిపిస్తాడు.

గతం రామ్ మరియు ప్రిన్స్ కలిసి 'నేను శైలజ ' అనే చిత్రం లో నటించారు.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది, ఇందులో ప్రిన్స్ పాజిటివ్ రోల్ చెయ్యగా, స్కంద లో మాత్రం పూర్తి స్థాయి నెగటివ్ రోల్ చేస్తున్నారు.

మరి జనాలు ఆయన రోల్ ని ఎలా తీసుకుంటారో చూడాలి.

నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?