రామ్ ఆ సినిమాలు వదులుకుని మంచి పని చేశాడా?

సినిమా బ్యాగ్రౌండ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో రామ్ పోతినేని.

నిర్మాత స్రవంతి రవి కిశోర్ తమ్ముడి కొడుకుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

చిన్న వయసులోనే సినిమాల్లో వచ్చి తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటుకున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో.

వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో కేవలం 17 సంవత్సరాలకే హీరోగా తెలుగు జనాలకు పరిచయం అయ్యాడు.

ఈ సినిమాలో తనకు జోడీగా నటించిన హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా.ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.

ఈ సినిమా తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోలేదు.లవ్ అండ్ ఎంటర్ టైనర్ మూవీస్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

గత 14 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు రామ్.

ఇప్పటి వరకు తన కెరీర్ లో రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, హలో గురు ప్రేమకోసమే సహా పలు సినిమాలు చేశాడు.

మంచి విజయాలు అందుకున్నాడు.అయితే గడిచిన కొంత కాలం వరకు రామ్ ఎప్పుడూ లవ్ సినిమాలే చేస్తాడు అనే విమర్శ ఉండేది.

ఆ విమర్శలన్నింటికీ చెక్ పెట్టాడు రామ్.దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు.

ఈ సినిమాలో లుక్ తో పాటు మాట తీరులోనూ ప్రత్యేకత చాటాడు.ప్రేమ సినిమాలే చేస్తాడు అనే వారందరికీ ఈ సినిమాతో చెక్ పెట్టాడు రామ్.

"""/"/ అయితే తన కెరీర్ లో పలు సినిమాలు వద్దు అనుకున్నాడు రామ్.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని,సమంత జంటగా నటించిన ఏటో వెళ్ళిపోయింది మనసు మూవీని మొదట చేయాల్సిందిగా రామ్ ను అడిగాడు.

కానీ వద్దు అనుకున్నాడు.అటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస మూవీ సైతం ముందుగా రామ్ దగ్గరికే వెళ్లింది.

పలు కారణాలతో వద్దు అనుకున్నాడు.ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు కూడా.

"""/"/ అటు రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా రాజా ది గ్రేట్.

ఈ సినిమాను కూడా తను వదులుకున్నాడు.కానీ ఈ సినిమా కాస్త ఫర్వాలేదు అనిపించింది.

అయితే రామ్ నిర్ణయం కరెక్ట్ గానే ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది ఇండస్ట్రీలో.

తాజ్ మహల్ ప్యాలెస్‌లో టీ తాగిన మధ్యతరగతి వ్యక్తి.. ఆ టీ ధర తెలిస్తే..?