పూర్తిగా మారిపోయిన హీరో రామ్.. అహర్నిశలు కష్టపడి ఇలా?
TeluguStop.com
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించడానికి కంటే ముందుగా ఎనర్జిటిక్ స్టార్ గా, లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిలను ఆకట్టుకున్న రామ్ పోతినేని, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలో ఉన్న మరొక యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ తన మాస్ యాంగిల్ తో ప్రేక్షకులను బాగా సందడి చేశారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలకు ముందు వరకు ఎనర్జిటిక్ స్టార్ గా ఉన్నటువంటి ఈయన ఆ తర్వాత ఉస్తాద్ రామ్ గా మారిపోయారు.
చాలా సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేనటువంటి రామ్ కి ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అందించిందని చెప్పవచ్చు.
ఈ సినిమా తర్వాత అదే మాస్ లుక్ లో రెడ్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. """/"/
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్న రామ్ తన శరీర ఫిట్ నెస్ కోసం పూర్తిగా కష్టపడుతున్న తెలుస్తోంది.
తాజాగా రామ్ పోతినేని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే మెలి తిరిగిన కండలతో బల్లాల దేవుడికి అన్నగా అన్నట్టు తన లుక్ మొత్తం మార్చేశాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు రామ్ లుక్ చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
ప్రతి ఒక్క సినిమాకు తనని తాను మార్చుకుంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్న రామ్ ను చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం రామ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పెదాల నలుపును పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్..!