చంటి సినిమాని వెంకటేష్ కంటే ముందే ఆ స్టార్ హీరో చేయాలనుకున్నాడు ఆయన ఎవరంటే..?

వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా వచ్చిన చంటి సినిమా తమిళ్ లో వచ్చిన చిన్న తంబీ సినిమాకి రీమేక్ గా వచ్చింది.

చంటి సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది.ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన కే ఎస్ రామారావు వెంకటేష్ కంటే ముందే ఈ సినిమాని రాజేంద్ర ప్రసాద్ తో చేద్దాం అనుకున్నారు కానీ మధ్యలో రామానాయుడు వచ్చి ఈ సినిమా వెంకటేష్ గారికి అయితే బాగుంటుంది అని చెప్పి వెంకటేష్ తో చేసేలా చేసాడు.

దాంతో రాజేంద్ర ప్రసాద్ కి వెంకటేష్ కి మధ్య కొన్ని రోజుల పాటు మాటలు లేకుండా పోయాయి.

అయితే చంటి సినిమాలో వెంకటేష్ అమాయకం గా నటించాలి ఈ సినిమా చూసాక ఈ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా బాగా చేసేవాడు అని కూడా చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కొన్నిసార్లు సినిమాల వల్ల ఇలా హీరోల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి చంటి సినిమాలో వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంటుంది.

రవి రాజా పినిశెట్టి డైరెక్షన్ కూడా ఈ సినిమా విజయానికి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి.

"""/" / దీనికి ఒరిజినల్ సినిమా అయిన చిన్న తంబీ సినిమాని డైరెక్షన్ చేసిన పి వాసు కు ఎంత మాత్రం తగ్గకుండా రవి రాజా పినిశెట్టి చాలా బాగా చేసాడు అనే చెప్పాలి.

రవి రాజా పినిశెట్టి తెలుగులో కూడా చాలా సినిమాలే చేసాడు ముఖ్యంగా రవి రాజా పినిశెట్టి అంటేఎక్కువ గా రీమేక్ సినిమాలకు పెట్టింది పేరు.

"""/" / అప్పట్లో తమిళ్ సినిమాలు అన్నిటిని తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా రీమేక్ చేసి హిట్ కొట్టేవాడు.

అలా తాను టాప్ హీరోలందరితో హిట్ కొట్టి చూపించాడు.మొత్తానికి ఈ సినిమా వల్ల రాజేంద్రప్రసాద్ వెంకటేష్ మధ్య కొంత కాలం గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు.

అయితే వీళ్ల కాంబినేషన్ లో ఈ మధ్య వచ్చిన F3 సినిమాలో ఇద్దరు కలిసి నటించారు దాంతో వీళ్ల మధ్య ఉన్న గొడవ ఇక ముగిసిపోయినట్టే అని తెలిసింది.

తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌