దేవుడంటే నమ్మకం లేని రాజశేఖర్ దేవుడిని నమ్మడానికి అసలు కారణమిదే.. జీవిత అలా చెప్పడంతో?
TeluguStop.com
టాలీవుడ్ ఒకప్పటి హీరో రాజశేఖర్( Rajasekhar ) గురించి మన అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు రాజశేఖర్.ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
అయితే టాలీవుడ్( Tollywood ) హీరోలలో రాజశేఖర్ ది డిఫెంట్ స్టైల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సినిమాలు స్టార్ హీరోలకు పోటీగా.ఆడేవి.
రాజశేఖర్ పోలీస్ పాత్ర చేశాడంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి.అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ పాత జ్ఞాపకాలను అన్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో విలన్ పాత్రలు చేశాడు.ఆ తరువాత హీరోగా మారి రచ్చ చేశాడు.
మరీ ముఖ్యంగా రాజశేఖర్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు.ఆయన ఖాకీ చొక్కా వేసుకుంటే పూనకాలు వచ్చేవి.
ప్రతిఘటన సినిమాతో వెండితెరను దడదడలాండించాడు రాజశేఖర్.ఇక అంకుశం సినిమాలో( Ankusam ) ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది.
అయితే రాజశేఖర్ సినిమాలు ముఖ్యంగా పోలీస్ పాత్రలకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు.
ఎందుకంటే రాజశేఖర్ కు కాస్త మటలు తడబడే అలావాటు ఉంది.ఫ్యూయెట్ గా మాట్లాడలేడు.
దాంతో ఆయన డబ్బింగ్ పై ఆధారపడ్డాడు.ఆ సినిమాల కోసం తన ఇంటిని కూడా అమ్మేశాడు.
"""/" /
ఆ తరువాత మళ్ళీ నిలబడ్డాడు.అంత సినిమా పిచ్చి ఉన్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అలరిస్తున్నాడు.
తాజాగా విడుదల అయిన నితిన్ ఎక్స్ ట్రా ఆర్ధినరీ మ్యాన్ సినిమాలో నటించి మెప్పించాడు.
ఈ క్రమంలో ఆయన ఒకప్పుడు తన జీవితం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మొదట్లో తనకు దేవుడంటే నమ్మకం లేదు అని తెలిపారు.అప్పట్లో తనకంటే ఐదేళ్లు పెద్ద అమ్మాయిని ప్రేమించానని, అయితే ఆ అమ్మాయి రిజక్ట్ చేసిందని, అమ్మాయి రిజక్ట్ చేయడంతో దేవదాస్ అయ్యానని మందుకు సిగిరెట్ కు అలవాటు పడ్డానని తెలిపారు.
అప్పుడు ఒక ఫ్రెండ్ దేవుడి మీద నమ్మకం లేదు అందుకే ఇలా జరిగింది అని చెప్పుకొచ్చారు హీరో రాజశేఖర్.
అదే సమయంలో పక్కన ఉన్న ఒక శివాలయానికి వెళ్ళాను. """/" /
ఆ సమయంలో నేను తాగేసి ఉన్నాను.
దేవుడిని మీ పై నమ్మకం లేదు.నేను తాగి ఉన్నాను క్షమించమని అడిగాను.
అలాగే తాను ఒక అమ్మాయిని ప్రేమించానని కానీ రిజక్ట్ చేసిందని చెప్పుకున్నాను.ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే నమ్ముతాను.
లేదంటే మీరు రాయి అనే నమ్ముతాను అని చెప్పాను.ఆ తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది అని అన్నారు రాజశేఖర్.
రా రా పోరా.అన్న అమ్మాయి రండి పొండి.
అని అంది అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు.
మాజీ హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?