Hero Rajasekhar : నాకు నత్తి ఉండటం తో ఏ భాషను సరిగ్గా మాట్లాడలేను : హీరో రాజశేఖర్
TeluguStop.com
రాజశేఖర్ తెలుగు ఆడియన్స్ కి యాంగ్రీ యంగ్ మాన్ గా బాగానే పరిచయం.
ప్రస్తుతం 61 ఏళ్ళ వయసులోనూ హీరో గానే రాణిస్తున్నారు రాజశేఖర్.( Hero Rajasekhar ) ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా చెన్నైలోనే కావడం విశేషం.
అయితే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు.చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక ఉన్న తండ్రి కోరిక మేరకు మొదట డాక్టర్ చదువు పూర్తి చేసి కొన్ని రోజులు పాటు ప్రాక్టీస్ కూడా చేశారు.
ఆ తర్వాత 1984లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.మొదటి తమిళ సినిమాల ద్వారానే ఆయన వెండితెరకు పరిచయమయ్యారు.
ఒక రెండు సినిమాలు చేసిన తర్వాత మొట్టమొదటిగా 1985లో ప్రతిఘటన( Pratighatana Movie ) అనే సినిమాతో ఆయన తెలుగులో నటించడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన ఆయన చివరగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్.
ఈ సినిమాతోనే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రయాణం మళ్లీ మొదలుపెట్టారు. """/" /
అయితే ఇటీవల తన కూతుర్లతో కలిసి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడారు.
ఇక యాంకర్ మీకు ఏ భాషలు వచ్చు సార్ అంటే నాకు ఏ భాష సరిగ్గా రాదయ్యా, నేను నత్తితో బాధపడుతున్నాను.
అందుకే నేను ఏ భాషలో సరిగా మాట్లాడలేను.చిన్నప్పుడు ఇంకా ఎక్కువగా నత్తి ఉండేది.
అందుకే తమిళ్ పూర్తిగా రాలేదు.ఆ తర్వాత తెలుగులోకి వచ్చాక తమిళ్ మర్చిపోయాను.
ఇప్పుడు తెలుగులో ( Telugu ) కూడా సరిగ్గా మాట్లాడను.పబ్లిక్ మీటింగ్ అంటే చాలా భయం.
పది మందిలో స్పీచ్ ఇవ్వాలంటే( Speech ) ఇబ్బంది పడతాను.అందుకే ఏ భాష కూడా పూర్తిగా వచ్చు అని ఒప్పుకోలేకపోతున్నాను అంటూ సరదాగా సమాధానం చెప్పారు.
"""/" /
ఇలా చెన్నైలో పుట్టి తెలుగులో స్థిరపడిన రాజశేఖర్ నత్తి తో బాధపడటం వల్ల కొన్ని పాత్రలు కూడా పోగొట్టుకున్నారట.
అసలు వీడేం హీరో అవుతాడు అని మొదట్లో అనుకునేవారట.మాట్లాడటం కూడా సరిగ్గా రావడం లేదు హీరో లక్షణాలు ఏముంటాయి అని అనుకునేవారట.
కానీ వాటన్నిటిని అధిగమించి ఆయన హీరోగా ఎదిగారు ఆయన సినిమాలకు ఎక్కువగా సాయికుమార్ డబ్బింగ్( Saikumar Dubbing ) చెప్పేవారు.
వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా విజయవంతం అయ్యాయి.
కెనడా ఇమ్మిగ్రేషన్ ప్లాన్ 2025 : పర్మినెంట్ రెసిడెన్సీ ఎవరికీ? ..బహిష్కరణ వేటు ఎవరిపై?