వీడియో: తల్లికి కొత్త ఫోన్ కొనిచ్చిన కొడుకు.. ఆమె రియాక్షన్ చూసి ప్రముఖ హీరో ఫిదా..!

పిల్లల సంతోషం కోసం ఏ తల్లిదండ్రులైనా సరే రాత్రనకా పగలనకా కాయకష్టం చేస్తుంటారు.

పిల్లలు అడిగిందల్లా ఇవ్వటం మా బాధ్యత అన్నట్లుగా వారు కష్టపడుతుంటారు.అయితే అలాంటి గొప్ప తల్లిదండ్రులపై తిరిగి ప్రేమ కురిపిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.

తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఇలాంటి ఆనందకరమైన క్షణాలు చూస్తే ఎవరి మనసైనా కరిగి పోవాల్సిందే.

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కొడుకు తన తల్లికి ఫోన్ కొనివ్వగా ఆమె సంతోషంతో బాగా ఎమోషనల్ అయిపోయింది.

విగ్నేష్ అనే ఒక వ్యక్తి ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే దాదాపు 7 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో చూసి ప్రముఖ సినీ హీరో ఆర్ మాధవన్ కూడా ఫిదా అయ్యాడు.

ఆ తల్లి ఆనందానికి వెలకట్టలేమని ఆయన హార్ట్ సింబల్స్ తో ట్వీట్ ని రీకోట్ చేశారు.

విగ్నేష్ సాము అనే వ్యక్తి "మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా రూ.8,800తో ఒక ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చా.

ఆ ఫోన్ ధర ఏమో గానీ మా అమ్మ హ్యాపీనెస్ కు మాత్రం వెలకట్టలేను" అని ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నాడు.

జనవరి 5న షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ అయిన వీడియోలో విగ్నేష్ తల్లిని చూడొచ్చు.అప్పటికే విగ్నేష్ ఆమెకు ఒక బ్యాగ్ ఇచ్చి అందులో ఉన్న ఒక కవర్ బయటికి తీయాలని చెప్పాడు.

"""/"/ "నీకోసం ఒక బర్త్ డే గిఫ్ట్ తెచ్చానమ్మా, అది ఓపెన్ చేసి చూడు" అన్నట్టు అతను అడగడం చూడొచ్చు.

తర్వాత తల్లి కవర్ ఓపెన్ చేసి అందులో మొబైల్ ఫోన్ ఉండటం చూసి చాలా సంతోషపడింది.

తర్వాత కొడుకు దగ్గరకొచ్చి ఆప్యాయంగా ఇంత ఖర్చుతో నా కోసం బహుమతి తెచ్చావా అంటూ మరిసిపోయింది.

ప్రేమతో కొడుకు కొనిచ్చిన మొబైల్ ఫోన్ ను అపురూపంగా చూస్తూ ఆమె చాలా క్యూట్ గా రియాక్షన్ ఇచ్చింది.

ఈ అమూల్యమైన రియాక్షన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.మరికొందరు భావోద్వేగానికి లోను అవుతున్నారు.

ఆమె సంతోషం వెలకట్టలేనిదంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ బ్యూటిఫుల్ వీడియో పై మీరు కూడా ఒక లుక్కు వేయండి.

మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి వేడుకలు… ఫోటోలు వైరల్!