పూరీ జగన్నాథ్ భార్య ప్రవర్తన అలా ఉంటుందట.. ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

ప్రభాస్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు తెరకెక్కాయి.

ఈ సినిమాలలో బుజ్జిగాడు అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా ఏక్ నిరంజన్ సినిమా ఫ్లాప్ అయింది.

అయితే పూరీ జగన్నాథ్ ప్రేక్షకులకు సుపరిచితమైనా ఆయన భార్య లావణ్య గురించి మాత్రం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పూరీ జగన్నాథ్ భార్య లావణ్య గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అందరినీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ రొమాంటిక్ సినిమాపై అంచనాలను పెంచడం కోసం ఆకాష్ పూరీని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి గల కారణాన్ని సైతం ప్రభాస్ వెల్లడించారు.

ప్రభాస్ బుజ్జిగాడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

పూరీ జగన్నాథ్ భార్య లావణ్య మంచితనం గురించి ప్రభాస్ చెప్పుకొచ్చారు.బుజ్జిగాడు సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, పూరీ జగన్నాథ్ భోజనం చేస్తుండగా మరో మహిళ కూడా అక్కడ భోజనం చేస్తున్నారని తాను ఆమె ఎవరని కనుక్కోగా పూరీ జగన్నాథ్ ఇంట్లో పని చేసే పనిమనిషి అనే సమాధానం వినిపించిందని ప్రభాస్ తెలిపారు.

"""/"/ తమతో పాటు పనిమనిషిని కూడా భోజనానికి కూర్చోబెట్టుకునే మంచి గుణం లావణ్యదని ప్రభాస్ వెల్లడించారు.

"""/"/ ఈ రీజన్ వల్లే తాను రొమాంటిక్ సినిమాకు ఈ విధంగా సహాయం చేశానని ప్రభాస్ పేర్కొన్నారు.

అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని ఆకాష్ పూరీకి ప్రభాస్ సలహా ఇవ్వడం గమనార్హం.వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజవుతున్నాయి.

ప్రభాస్ సినిమాలలో ఒక్కటి సక్సెస్ సాధించినా ప్రభాస్ జాతకమే మారిపోయే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

ప్రభాస్ ప్రతిభ ఉన్న, పాన్ ఇండియా టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్సులు ఎక్కువగా ఇస్తున్నారు.

ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..?