పొలాల్లో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ వింటేజ్ ఫోటోలో ప్రభాస్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే!

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇండియా లెవెల్ లో వినిపిస్తున్న పేరు ప్రభాస్( Prabhas ).

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సినిమా సినిమాకు తన క్రేజ్ ని ఫాలోవర్స్ ని మరింత పెంచుకుంటూ దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

సలార్, కల్కి 2898ఏడీ ( Salar, Kalki 2898 AD )సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు అందుకొని ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయాడు.

వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రెండు సార్లు అందుకున్న సౌత్ ఇండియా స్టార్ గా ప్రభాస్ నిలిచారు.

"""/" / కల్కి 2898ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.

నెక్స్ట్ అతని నుంచి రాబోయే సినిమాలు అన్ని కూడా 300+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా 100 కోట్లకి పైగా అందుకుంటున్నాడు.ప్రభాస్ గురించి తెలియాలి అంటే ఆయనతో పని చేసిన వారిని అడిగితే చాలు.

ప్రభాస్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.కాగా సొంతూరు మొగల్తూరు( Mughaltur ) కూడా ఎప్పటికప్పుడు ప్రభాస్ వెళ్తూ ఉంటాడు.

గతంలో అయితే సంక్రాంతి వస్తే సొంతూరు వెళ్లిపోయేవాడు.ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పాలి.

"""/" / కాగా తాజాగా ప్రభాస్ కి సంబందించిన ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొగల్తూరులో తన అన్న ప్రమోద్( Pramod ) తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసినపుడు క్యాజువల్ గా దిగిన ఫొటోని ఒక నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ ఫోటోలో యంగ్ లుక్ లో ప్రభాస్ చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు.

అలాగే సింపుల్ గా కనిపిస్తున్నాడు.ఈ లుక్ డార్లింగ్ సినిమా సమయంలోంది అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రెబల్ మూవీకి ముందు అని కొంతమంది అంటున్నారు.కొందరు ఏ సినిమాలోదైతే నేముంది ప్రభాస్ లుక్ మాత్రం అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వర్షాకాలంలో చేపలు తింటున్నారా.. అయితే ఈ జబ్బులు ఖాయం!