ప్రభాస్ ఓటు వెయ్యకపోవడానికి కారణం అదేనా..? వైరల్ అవుతున్న రాజమౌళి కామెంట్స్!
TeluguStop.com
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.
రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఈ నెల రోజులు తమ మ్యానిఫెస్టోలు మరియు వాగ్దానాలతో జనాల మెప్పు పొందేందుకు తెగ ప్రయత్నాలు చేసారు.
ఈరోజు కోట్లాది మంది తెలంగాణ ప్రజలు తమ తీర్పు ని ఇచ్చేసారు.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని తెలిసిపోతుంది.
ఇదంతా పక్కన పెడితే పోలింగ్ శాతం హైదరాబాద్ లో చాలా తక్కువ ఉండడం అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం.
డబ్బులు ఇష్టమొచ్చినట్టు పంచి, సెలవు దినం ప్రకటించిన తర్వాత కూడా ఇలా అయ్యింది అంటే జనాలు నిర్లక్ష్యం చెయ్యడం వల్లే అని చెప్పొచ్చు.
"""/" /
అయితే సినీ తారలు తమ బాధ్యతగా పోలింగ్ బూత్ కి వచ్చి ఓట్లు వేసి( Vote ) జనాలకు ఓటు వెయ్యడం మన బాధ్యత అనేది తెలియచేసే ప్రయత్నం చేశారు.
అందరూ వచ్చి ఓట్లు వేశారు కానీ, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) మాత్రం రాలేదు.
ఇదే ఇప్పుడు పెద్ద చర్చ కి దారి తీసింది.ప్రభాస్ హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, రావడానికి ఏమిటి నొప్పి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేసారు.
అయితే ప్రభాస్ మొదటి నుండి ఇలాంటి కార్యక్రమాలకు దూరం గా ఉంటూ వస్తున్నాడు.
ప్రభాస్ కి బద్ధకం చాలా ఎక్కువ అని ఆయనతో మూడు సినిమాలు చేసిన రాజమౌళి( Rajamouli ) అనేక ఇంటర్వ్యూస్ లో చెప్తాడు.
"""/" /
ప్రభాస్ కి బద్ధకం చాలా ఎక్కువే కానీ, సినిమా షూటింగ్ విషయం లో మాత్రం ఆ బద్ధకం పక్కన పెట్టి వస్తాడు.
ఎంత కష్టమైన పని చేస్తాడు, అదే ప్రభాస్ లో నాకు నచ్చే అంశం అని చెప్పుకొస్తాడు.
రాజమౌళి మాటలను గుర్తు చేసుకుంటూ ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ కొంత మంది ఆ వీడియోస్ ని ప్లే చేసి, ప్రభాస్ కి బద్ధకం ఎక్కువ అని రాజమౌళి అప్పట్లో చెప్తే నమ్మలేదు కానీ, ఈరోజు చూస్తే అర్థం అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రభాస్ హీరో గా నటించిన సలార్ చిత్రం( Salaar ) డిసెంబర్ 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
రేపు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు.ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఈ ట్రైలర్ తో అది వేరే రేంజ్ కి వెళ్లబోతుంది అని చెప్పొచ్చు.
వేణు స్వామికి మరోసారి నోటీసులు