ప్రభాస్ సినిమా నుంచి భారీ సీన్స్ లీక్..?

ప్రభాస్ ( Prabhas ) హీరోగా బహుబలి లాంటి పాన్ ఇండియా మూవీస్ వచ్చిన విషయం మనకు తెలిసిందే.

పాన్ ఇండియా హీరో అయిన కూడా కొంచం కూడా గర్వం లేకుండా బయట ప్రభాస్ అందరిని ఆప్యాయంగా డార్లింగ్ అని పిలిస్తు పలకరిస్తూ ఉంటాడు.

ప్రభాస్ కి అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో ఫుల్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది.

ప్రభాస్ కు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా ఇట్టే వైరల్ అవుతుంది .

ఇక తాజాగా ప్రభాస్ సినిమాల గురించి అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది .

ప్రస్తుతం ప్రభాస్ .నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు .

ప్రభాస్ చిత్రాలన్నీ స్టార్ డైరెక్టర్స్ తో కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి .

ప్రశాంత్ నీల్‌తో 'సలార్', ఓం రౌత్‌తో 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్‌తో 'ప్రాజెక్టు కె ', సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ మూవీకి సిగ్నల్ ఇచ్చాడు.

ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను ఓకే చేసేసిన ప్రభాస్. """/" / ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' ( Raja Deluxe ) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది.ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో రహస్యంగా జరుగుతోంది.

ఇందుకోసం ఓ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో చిత్రీకరణ చేస్తున్నారు.ఇలా ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి క్రేజీ న్యూస్ లీకైంది.హర్రర్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్( Sanjay Dutt ) దెయ్యం పాత్రను చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి.

ఇక, తాజా సమాచారం ప్రకారం. """/" / ఇందులో ఆయన సీన్స్ అన్నీ అదిరిపోయేలా వచ్చాయని తెలిసింది.

ముఖ్యంగా ఈ చిత్రంలో హర్రర్ సీన్స్, వాటి వెనుక వచ్చే సౌండ్స్ ఓ రేంజ్‌లో భయపెట్టేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు.ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వని విధంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి ఇందులో టాలీవుడ్‌లో గతంలో చూడని కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నారని టాక్.ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి.

ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం మారుతి స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు .

ప్రభాస్ కి ఓ మంచి హిట్ ఇవ్వాలనే తపనతో పని చేస్తునట్టు యూనిట్ చెబుతుంది.

వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన