వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ పై లేటెస్ట్ అప్డేట్.. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తన ఆటిట్యూడ్, మ్యానరిజంతో ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టాడు పవన్.

పవన్ ఇంతకు ముందు కంటే స్పీడ్ పెంచి వరుస సినిమాలను లైన్లో పెడుతూ వెళ్తున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇటీవలే స్టార్ట్ చేసారు.ఆ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు శరవేగంగా పూర్తి చేసాడు క్రిష్.

ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో జూన్ లేదా జులై లోపు ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నాడు.

అందుకే ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.అయితే గత కొద్దీ రోజుల క్రితం షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా మళ్ళీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతుంది.

"""/" / ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పై అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 7 నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

"""/" / పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఏకంగా 200 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం అందులోను భారీ పీడియాడిక్ సినిమా కావడం వల్ల సెట్స్ కోసం, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని సమాచారం.

ఇక ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

క్యారెట్ పంట సాగులో బూడిద తెగుళ్ల నివారణకు చర్యలు..!