భారత సంతతి మహిళ హత్య.. ‘‘ హీరో , దేశభక్తురాలు ’’ అంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడి ప్రశంసలు
TeluguStop.com
పీపీఈ కిట్లకు సంబంధించిన కుంభకోణంపై కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఇవ్వడంతో హత్యకు గురైన భారత సంతతి మహిళ బబిత దేవ్ కరన్‌పై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్‌ఫోసా ప్రశంసలు కురించారు.
ఆమె హీరో , దేశభక్తురాలని ఆయన కొనియాడారు.బబితను దారుణంగా హత్య చేయడం బాధాకరమే అయినప్పటికీ.
దేశం కోసం ఆమె పోరాటం ఆమోఘమని రామ్‌ఫోసా అన్నారు.సమాజంలో అవినీతి అనే క్యాన్సర్‌ను తొలగించాలనే దానికి ఆమె మరణం ఒక తార్కాణమన్నారు.
బబిత హత్యకు కారణం ఏంటనే దానిపై ఇప్పటి వరకు వివరాలు తెలియకపోయినా.వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ కిట్ల) కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో కీలక సాక్షిగా వుండటం వల్లే ఆమె హత్యకు గురై వుండొచ్చని రామ్‌ఫోసా అభిప్రాయపడ్డారు.
దేవ్ కరన్ వంటి ధైర్యవంతులైన దక్షిణాఫ్రికా వాసులు .అవినీతికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగానే వుంటారని అన్నారు.
ఇదిలావుండగా.బబిత హత్య కేసుకు సంబంధించి గురువారం ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదే ఘటనలో గతవారం ఆరుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరు అనుమానితులు తమ కార్లలో పెద్దమొత్తంలో దొరికిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని పోలీస్ శాఖ మంత్రి భేకి సెలె మీడియాతో అన్నారు.
"""/"/
కాగా, దక్షిణాఫ్రికాలో 53 ఏళ్ల భారత సంతతికి చెందిన బబిత దేవ్ కరన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
గౌటెంగ్ ప్రావిన్షియల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌లో సీనియర్ ఆఫీసర్‌గా వున్న భారత సంతతికి చెందిన బబితా గత మంగళవారం తన బిడ్డను స్కూల్ దగ్గర దించారు.
అనంతరం జోహెన్నెస్‌బర్గ్ శివారులో వున్న తన ఇంటికి వెళ్తుండగా ఆమెపై గుర్తుతెలియని దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే బబిత చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఆమె హత్య కేసుపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల సరఫరాలో 330 మిలియన్ల రాండ్స్ (అమెరికా కరెన్సీలో 20 మిలియన్ డాలర్లు) కుంభకోణం జరిగినట్లుగా ఆమె ప్రభుత్వానికి కీలక సమాచారం అందించడం వల్ల బబిత హత్యకు గురయ్యారని భావిస్తున్నారు.
ఒక్క లిప్ లాక్ సీన్ కోసం 37 టేకులు.. ఆ సీన్ గురించి హీరో రియాక్షన్ ఇదే!