మహేష్, బన్నీ, రవితేజ తర్వాత నితిన్.. ఈ యంగ్ హీరో ప్లాన్ అదుర్స్ అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్, బన్నీ, రవితేజలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ హీరోలు ఇప్పటికే ఏషియన్ గ్రూప్ తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణాల దిశగా అడుగులు వేశారు.
మహేష్ ఏఎంబీ, బన్నీ ఏఏఏ సినిమాస్ మంచి లాభాలను సొంతం చేసుకుంటుండగా రవితేజ ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంలో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే.
"""/" /
అయితే ఈ జాబితాలో నితిన్( Nithiin ) కూడా చేరారని సమాచారం అందుతోంది.
హీరో నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.సంగారెడ్డి ప్రాంతంతో ఏషియన్ నితిన్ సితార పేరుతో మల్టీప్లెక్స్ ను నితిన్ నిర్మించనున్నారని సమాచారం అందుతోంది.
ఇప్పటికే థియేటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని త్వరలో ఈ థియేటర్ ఓపెనింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.
"""/" /
నితిన్ ప్రస్తుతం తమ్ముడు( Nithin Thammudu ) అనే మరో సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
దిల్ రాజు శిరీష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తమ్ముడు సినిమాలో లయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నితిన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నితిన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.నితిన్ కు మాస్ సినిమాల కంటే క్లాస్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నితిన్ పాన్ ఇండియా హిట్లను అందుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నితిన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
నితిన్ వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపిస్తూ తన లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.
హీరో నితిన్ కు సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలే ఎక్కువగా విజయాలను అందిస్తున్నాయి.
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగువారితో పాటు 30 మంది బలి!