గన్ను గురి పెట్టిన నిఖిల్..!

యువ హీరో నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు దాదాపు ముగింపు దశకు వచ్చాయి.ఈ సినిమాల తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బి.

హెచ్ సినిమా వస్తుంది.స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో నిఖిల్ గూఢచారి గా కనిపించనున్నారు.

నిఖిల్ కెరియర్ లో ఫస్ట్ టైం స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కోసం లేటెస్ట్ గా ఓ తుపాకి పట్టుకుని స్టిల్ ఇచ్చాడు నిఖిల్.

తను చేయబోయే సినిమా కోసమే ఇది అని తెలుస్తుంది.గ్యారీ బి.

హెచ్ ఇదివరకు సినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.ఆయన మొదటిసారి డైరెక్ట్ చేస్తూ వస్తున్న సినిమా ఇది.

తెలుగు ఆడియెన్స్ కు స్పై థ్రిల్లర్ సినిమాలు అంటే చాలా ఇష్టం.పర్ఫెక్ట్ గా చేస్తే మాత్రం ఆ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.

ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.నిఖిల్ గన్ను గురి పెట్టి హిట్ టార్గెట్ పెట్టాడని అతని ఫోటో కింద కామెంట్స్ పెడుతున్నారు.

కార్తికేయ 2 మరో ప్రయోగం కాగా 18 పేజెస్ మాత్రం లవ్ స్టోరీగా వస్తుంది.

మరి ఈ మూడు సినిమాలతో నిఖిల్ స్టార్ క్రేజ్ దక్కించుకుంటాడో లేదో చూడాలి.

ఆరెంజ్‌, లెమ‌న్ క‌న్నా ఈ ఫుడ్స్ లోనే విట‌మిన్‌ `సి` ఎక్కువగా ఉంటుంది.. తెలుసా?