అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చిన హీరో నిఖిల్.. ఏకంగా గిఫ్ట్ ఇస్తూ?
TeluguStop.com
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం కార్తికేయ 2.
ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు.కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.
జూలై 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ఆ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది.
దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
కార్తికేయ 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.నిఖిల్ సినిమాలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నానని నిఖిల్ అంటే తనకు ఎంతో ఇష్టమని మహేష్ అనే అభిమాని చెప్పాడు.
తనపై ఆ అభిమాని చూపిస్తున్న ప్రేమకు నిఖిల్ మంత్రముగ్దుడై వెంటనే అతడిని స్టేజ్‌పైకి పిలిచాడు.
తన కళ్ల అద్దాలు ఆ అభిమానికి బహుమతిగా ఇచ్చి.అతనితో సెల్ఫీ దిగాడు.
తన అభిమాన హీరో తనకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడంతో ఆ అభిమాని ఆనండానికి అవధులు లేకుండా పోయాయి.
"""/" /
తన ఆనందాన్ని ట్వీట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు సదరు అభిమాని.
తన జీవితంలో మర్చిపోలేని సందర్భం అని హీరో నిఖిల్ థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశాడు.
దీనికి నిఖిల్ స్పందిస్తూ బ్రో.ఆ కళ్లద్దాలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ సూచించాడు.
తనపై చూపించిన ప్రేమకు నేనిచ్చిన గిఫ్ట్ అంటూ అభిమాని మహేష్‌కు రిప్లై ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ట్వీట్ పై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
భారతదేశంలో కూడా భూకంపం రాబోతోందా? అసలేం జరుగుతోంది?