ఆ అడ్డా నుంచి నిఖిల్ ఔట్, కారణం
TeluguStop.com
అడ్డా ఏంటి,నిఖిల్ ఔట్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించి టాలీవుడ్ సింగిల్స్ అడ్డా అనే గ్రూప్ క్రియేట్ చేశారు.
అయితే నిఖిల్ ను సింగిల్స్ అడ్డా నుంచి నిర్ధక్ష్యంగా గెంటేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
టాలీవుడ్ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమా తో టాలివుడ్ లో అడుగుపెట్టినప్పటికీ కష్టపడే యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పాలి.
ఒకరకంగా చెప్పాలి అంటే బాహుబలి చిత్రం ఒక్కసారిగా ప్రభాస్ ఇమేజ్ మొత్తం మార్చేసింది అని చెప్పాలి.
అయితే ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇలాంటి ట్రాక్ రికార్డుతో దూసుకుపోతున్న ప్రభాస్ టాలివుడ్ సింగిల్స్ అడ్డా నుంచి నిఖిల్‌ను నిర్ధాక్షిణ్యంగా బయటకు నెట్టేశాడట.
వాస్తవానికి ఈ గ్రూప్ లో ప్రభాస్‌తో పాటు రానా, అడివి శేష్,అనుష్క,కాజల్, తమన్నా, శర్వానంద్, విజయ్ దేవరకొండలతో పాటు నిఖిల్ కూడా ఉన్నాడు.
అయితే రీసెంట్‌గా నికిల్.డాక్టర్ పల్లవి వర్మ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరుపుకోవడం తో అది చూసి గ్రూప్ అడ్మిన్ అయిన ప్రభాస్ వెంటనే నిఖిల్‌ను ఆ టాలీవుడ్ సింగిల్స్ అడ్డా గ్రూప్ నుండి తొలిగించనట్టు తెలుస్తుంది.
సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్న ఈ పిక్ చూసిన హీరో నిఖిల్.
దానిని రీ ట్వీట్ చేస్తూ ఎంతో సరదగా పడిపడి నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేయగా మరోపక్క నెటిజన్స్ కూడా చాలా ఫన్నీ గా ఉందంటూ తెగ కామెంట్ లు పెడుతున్నారు.
నల్ల మచ్చలు మీ అందాన్ని పాడు చేస్తున్నాయా.. వాటిని ఇలా వదిలించుకోండి..!