ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
TeluguStop.com
టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో కెరీర్ విచిత్రంగా సాగిన హీరోలలో నిఖిల్ ( Nikhil )ఒకరు.
హ్యాపీడేస్ సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ తర్వాత రోజుల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లేక కెరీర్ విషయంలో వెనుకబడ్డారు.
నిఖిల్ కెరీర్ ముగుస్తుందనే సమయంలో స్వామిరారా, కార్తికేయ విజయాలు ఈ హీరో కెరీర్ కు ఊపిరి పోశాయి.
మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కార్తికేయ2 సినిమాతో( Karthikeya 2 Movie ) పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ హిట్ సాధించారు.
"""/" /
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ( People's Media Factory Banner )కు సైతం కార్తికేయ2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిందనే చెప్పాలి.
అయితే కార్తికేయ2 తర్వాత నిఖిల్ కెరీర్ ప్లానింగ్ మాత్రం అస్సలు ఆశాజనకంగా లేదు.
స్పై సినిమా ఒక విధంగా నిరాశ పరిస్తే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మరో విధంగా నిరాశకు గురి చేసింది.
రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.థియేట్రికల్ కలెక్షన్ల విషయంలో ఈ సినిమా తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.
"""/" /
పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే విడుదలై థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయి హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
నిఖిల్ అభిమానులు స్వయంభూ సినిమాపై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో స్వయంభూ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.
ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో సరైన అప్ డేట్స్ రాలేదు.
నిఖిల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.నిఖిల్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ షేక్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి.. తెర వెనుక రంగం సిద్ధం