కాలి నడకన తిరుమలకు నాని, శ్రీనిధి శెట్టి.. వీళ్ల డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

టాలీవుడ్ హీరో నాని( Nani ) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం హిట్ 3.

( Hit 3 ) ఇందులో శ్రీనిధి శెట్టి( Srinidhi Shetty ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

విడుదల తేదీకి మరొక మూడు రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఇది ఇలా ఉంటే మూవీ టీమ్ తిరుమల( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు.

"""/" / సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.అయితే అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కాగా ఈ చిత్రంలో నాని అర్జున్‌ సర్కార్‌ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

"""/" / యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అభిమానులు అలాగే మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా గతంలో విడుదల అయిన హిట్ మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నాని భావిస్తున్నారు.అయితే నాని ఇందులో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.