Hero Nani: కాలేజీ డేస్ లవ్ గురించి సీక్రెట్ చెప్పిన నాని.. టైం దొరకలేదంటూ..!!

హీరో నాని ( Hero Nani ) మన ముందుకు హాయ్ నాన్న అనే మూవీ తో రాబోతున్నారు.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే డిసెంబర్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు మూవీ యూనిట్.

అలా ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి,పర్సనల్ విషయాల గురించి షేర్ చేసుకున్నారు చిత్ర యూనిట్.

తాజాగా నాని కాలేజీ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు.ఇందులో భాగంగా స్టూడెంట్స్ ఎన్నో ఫన్నీ క్వశ్చన్స్ కూడా నాని ని అడిగారు.

అలా ఫన్నీ ఆన్సర్స్ ఇస్తూ సినిమా గురించి ప్రమోట్ చేసుకున్నారు. """/"/ ఇక ఇందులో భాగంగా కొంతమంది నాని ని కాలేజ్ లవ్( College Love ) గురించి అడగగా ఈ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో నాని.

కాలేజీలో ప్రతి ఒక్కరికి వన్ సైడ్ లవ్ లేదా టూ సైడ్స్ లవ్స్ అనేవి ఉంటాయి.

కానీ అసలు విషయం ఏమిటంటే నాకు కాలేజ్ డేస్ లో ఎలాంటి ప్రేమాయణాలు లేవు.

అలాగే నేను కాలేజీ చదువుకునే సమయంలో నన్ను ప్రేమ విషయంలో కదిలించేంత అమ్మాయి మాత్రం కనిపించలేదు.

అలాగే లవ్ చేసే అంత సీన్ కూడా మాకు లేదు. """/"/ అంటూ తనకి లవ్ మేటర్స్ లేవని ఒకింత బాధతో ఉన్నట్టు మాట్లాడారు.

అంతేకాదు ఈ కాలేజీ మాత్రం కళకళలాడుతోంది ఈ కాలేజీలోని అబ్బాయిలకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి అంటూ కూడా నాని ఫన్నీ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం నాని తన కాలేజీ లైఫ్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక జెర్సీ మూవీలో తండ్రి కొడుకుల ప్రేమ గురించి చూపించిన నాని హాయ్ నాన్న ( Hi Nanna ) సినిమాలో తండ్రి కూతుర్ల ప్రేమ గురించి చూపించబోతున్నారు.

ఇక ఈ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

ప్రభాస్ అంత పెద్ద మోసగాడా.. సినిమాల్లో ఎంత మందిని మోసం చేశాడంటే..?