హీరో నాని తో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య..ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది!

న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన 'హాయ్ నాన్న'( Hi Nanna ) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది.

'దసరా' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని( Nani ) నుండి వస్తున్న చిత్రం ఇది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాని చూసి తెగ మెచ్చుకున్నారు.చాలా కాలం తర్వాత ఒక ఎమోషనల్ మూవీ టాలీవుడ్ కి వచ్చింది అంటూ కితాబు ఇచ్చారు.

మరి ప్రమోషనల్ కంటెంట్, సెన్సార్ టాక్ కి తగ్గట్టుగానే సినిమా వచ్చిందా లేదా అనేది రేపు తెలుస్తాది.

ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో ని హైదరాబాద్ లోని పాపులర్ మల్టీప్లెక్స్ AMB సినిమాస్ లో వేశారు.

"""/" / ఈ ప్రీమియర్ షో మూవీ యూనిట్ తో పాటుగా టాలీవుడ్ కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు.

వారిలో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య( Adya ) కూడా ఒకరు.తన నాన్న కుటుంబానికి సంబంధించిన హీరోల సినిమాలే థియేటర్స్ కి వచ్చి చూసే అలవాటు లేని ఆద్య, ఏకంగా నాని సినిమా ప్రీమియర్ షో కి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

టాలీవుడ్ లో ఆద్య మరియు అకిరా నందన్ కి అడవి శేష్ తో మంచి రిలేషన్ ఉంది.

శేష్ తో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఈ ఇద్దరు సరదాగా అతనితో గడుపుతారు.

అతని సినిమాలకు సంబంధించిన ప్రీమియర్ షోస్ కి కూడా హాజరు అవుతూ ఉంటారు.

అలాంటి నాని సినిమా ప్రీమియర్ షో కి కూడా ఆద్య వచ్చిందంటే నాని తో కూడా ఆమె మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తుందన్నమాట.

"""/" / ఇప్పటి వరకు ఆద్య నాని తో కలిసి ఫోటోలు దిగడం లాంటివి ఎప్పుడూ చెయ్యలేదు.

అకిరా కూడా నాని తో కలిసినట్టుగా ఎప్పుడూ కనపడలేదు.నాని కి రేణు దేశాయ్ కుటుంబం తో మంచి రిలేషన్ ఉన్న విషయం ఎవరికీ తెలియదు.

ఈరోజు ఒక్కసారిగా 'హాయ్ నాన్న' ప్రీమియర్ షో ( Premiere Show )లో కనిపించేలోపు అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.

నాని తో కలిసి ఆద్య దిగిన ఫోటోలు ఇంకా సోషల్ మీడియా లో రాలేదు, వస్తే అభిమానులు ఆ ఫోటోలు షేర్ చేసి తమ సంతోషాన్ని పంచుకోడానికి సిద్ధం గా ఉన్నారు.