ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా: నాని
TeluguStop.com
నేచురల్ స్టార్ నాని( Nani ) 2008లో రొమాంటిక్ కామెడీ "అష్టా చమ్మా" సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమయ్యాడు.
ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.తర్వాత అలా మొదలైంది (2011) సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కొన్ని సినిమాల తర్వాత స్టార్ హీరో అయిపోయాడు.ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు.
నాని చాలా టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.ఓన్లీ ప్రేక్షకులకు నచ్చే స్క్రిప్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే తెలివి కూడా ఉంది.
అందుకే ఇప్పటికీ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోల్లో ఒకడిగానే వస్తున్నాడు.ప్రస్తుతం ఈ హీరో తన "సరిపోదా శనివారం" మూవీ( Saripodhaa Sanivaaram ) ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నాడు.
ఈ విజిలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ రూ.90 కోట్ల బడ్జెట్లో రూపొందింది.
సరిపోదా శనివారం 29 ఆగస్టు 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో నాని వీలైతే అన్ని ఎక్కువ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుందని చెప్పాడు.
"""/" /
నాని మాట్లాడుతూ "నా సినిమా రిలీజ్ అయిన 3-4 రోజుల తర్వాత మూవీ హాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో వెతికినప్పుడు టాప్ ట్వీట్స్ కనిపిస్తాయి.
వాటిలో 'సినిమా బాగుందన్న.ఫస్ట్ ఆఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది.
పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.' వంటి ప్రశంసలు ఉంటాయి.
వాటిని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది.అయితే కొందరు మాత్రం తమ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఇష్టాన్ని చాలా అద్భుతంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు.
మనసులోతుల్లో దాగున్న భావాలను వారు బయటపడతారు.వారి మనసులో ఉన్న ప్రేమ అనేది మాటలు రూపంలో అలా బయటకు వస్తుంది.
అవి చాలా హానెస్ట్, జెన్యూన్ కామెంట్స్.వాటిని చదువుతున్నప్పుడు నిజమైన ప్రేమ మనకు తెలుస్తుంది.
" """/" /
"ఆ ప్రేమంతా దక్కించుకునే అర్హత ఉందని తెలుసుకున్నప్పుడు నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా.
ఆ సందర్భాల్లోనే నేను చాలా స్పెషల్ అని అనిపిస్తుంది.మనం ఏదో ఒక గొప్ప పని చేశామని అనిపిస్తుంది.
మాములు అమీర్‌పేట అబ్బాయిని కాదనే విషయం గుర్తుకొస్తుంది.అప్పుడు నా మనసు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది.
కానీ మనం జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చామని ఉన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది.
" అని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాజ్యసభ కు వెళ్లబోయే ఆ ముగ్గురు ఎవరు ? వీరంతా పోటీ ?