యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాగశౌర్య బంధువులా.. అదే నిజమంటూ?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
కొత్త సినిమా షూటింగ్ మొదలుకావడానికి మరో రెండు నెలల సమయం ఉండటంతో ఎన్టీఆర్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడ్డారు.
కొరటాల శివ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ గా కనిపించనున్నారు.ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఎనిమిది కిలోల బరువు తగ్గుతున్నారు.
ఎన్టీఆర్ కు జోడీగా అలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్నారు.అయితే గత కొన్నిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ నాగశౌర్య బంధువులని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
నాగశౌర్య కెరీర్ లో హీరోగా పలు విజయాలు ఉన్నాయి.నాగశౌర్య నటించిన కృష్ణా వ్రిందా విహారి ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమాపై పరవాలేదనే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.పలు ఇంటర్వ్యూలలో నాగశౌర్య జూనియర్ ఎన్టీఆర్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.
"""/"/
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య తల్లి ఉష తమ కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి బంధుత్వం అంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.
అయితే నందమూరి కుటుంబం అంటే నాగశౌర్యకు ప్రత్యేకమైన అభిమానం మాత్రం ఉందని ఆమె కామెంట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో బంధుత్వం అంటూ వార్తలు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయో తనకు తెలియదని ఆమె వెల్లడించారు.
"""/"/
లక్ష్మీ ప్రణతి కజిన్ నాగశౌర్యకు మంచి ఫ్రెండ్ అని ఆమె అన్నారు.
తమ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఆమె తెలిపారు.భవిష్యత్తులో తారక్, నాగశౌర్య కాంబినేషన్ లో సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.
సినిమాసినిమాకు తారక్, నాగశౌర్యలకు క్రేజ్ పెరుగుతోంది.కృష్ణా వ్రిందా విహారి సినిమాతో నాగశౌర్య సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.
కలికాలం.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్!