వెబ్ సీరీస్ చేస్తారా అన్న మీడియా ప్రశ్నలకు మహేష్ ఆన్సర్ ఏంటంటే..!
TeluguStop.com
వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే మహేష్ బాబు తన దగ్గరకు వచ్చిన ప్రకటనలను మాత్రం అసలు వదులుకోడు.
బ్రాండ్ అంబాసిడర్ గా సౌత్ లోనే టాప్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్.
లేటెస్ట్ గా మహేష్ బిగ్ సి మొబైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు.
దీనికి సంబందించిన ప్రెస్ మీట్ లో భాగంగా మీడియా ఇంటరాక్షన్ జరిగింది.ఈ క్రమంలో మహేష్ తో వెబ్ సీరీస్ లపై తన అభిప్రాయాన్ని.
ఫ్యూచర్ లో వెబ్ సీరీస్ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నని ఫేస్ చేయాల్సి వచ్చింది.
మీరు వెబ్ సీరీస్ చేసే అవకాశం ఉందా.? అలాంటి ఛాన్స్ వస్తే చేస్తారా అన్న దానికి మహేష్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు.
ప్రస్తుతానికి వెబ్ సీరీస్ చేసే ఆలోచన లేదని.ఆ టైం కు అలాంటి కథ వచ్చి థ్రిల్ చేస్తే చూస్తానని అన్నారు మహేష్.
బాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం వెబ్ సీరీస్ లు చేస్తున్నారు.అయితే మహేష్ మాత్రం తాను వెబ్ సీరీస్ చేయడానికి కొంత టైం పడుతుందని అన్నారు.
సో మహేష్ ను ఎక్సయిట్ చేసే కథతో వస్తే తప్పకుండా మహేష్ కూడా వెబ్ సీరీస్ చేస్తాడని మాత్రం చెప్పొచ్చు.
అఖిల్ కొత్త సినిమా ప్రకటన ఆరోజేనా.. ఆ స్టార్ హీరో పుట్టినరోజున ప్రకటన రానుందా?