ఆ సినిమాలలో నటించాలని ఆశ పడుతున్న మహేష్ గారాల పట్టి.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు( Mahesh Babu ) కూతురు సితార ( Sitara )ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీల పిల్లల్లో సితార ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సితారకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.ఈమె చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది.
"""/" /
మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యాడ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే సితార కూడా నటిగా రాణించాలని ఆశపడుతోందట.గత జనరేషన్స్ లో స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్స్ గా మారే సాంప్రదాయం లేదు.
ఆలోచనలు, పద్ధతులు మారాయి.జెండర్ డిఫరెన్సెస్ అనేవి ఇప్పుడు లేవు.
కాగా బాల్యం నుండే సితార నటిగా రాణించడానికి కావాల్సిన పునాదులు వేసుకుంటుంది.ఆమె డాన్సులో శిక్షణ తీసుకుంటుంది.
మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ రాబడుతోంది. """/" /
సితారకు ఉన్న క్రేజ్ రీత్యా పసిప్రాయంలోనే ఆమె ఒక అంతర్జాతీయ జ్యువెలరీ బ్రాండ్ కి ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఇంటర్వ్యూలో సితార నటి కావాలన్న కోరికను బయటపెట్టారు.హీరోయిన్ కావలని అనుకుంటున్నారా? అని అడగగా.
నేను చిన్నప్పటి నుండి నాన్నను చూస్తూ పెరిగాను.ఆ క్రమంలో సినిమా మీద, నటన పట్ల నాకు ఆసక్తి ఏర్పడ్డాయి.
భవిష్యత్ లో నటిస్తాను.అయితే ఇంగ్లీష్ చిత్రాల్లో ( English Movies )మాత్రమే నటించాలి అనుకుంటున్నాను అని తెలిపింది సితార.
ఉద్యోగాలు వదిలి, ఇల్లు అమ్మి.. ప్రపంచ యాత్ర చేపట్టిన యూకే జంటకు ఊహించని అదృష్టం..