తను నాతోనే ఉంది.. ఎమోషనల్ అయిన సూపర్ స్టార్ కృష్ణ..?

రేపు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజనే సంగతి తెలిసిందే.పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన కృష్ణ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ పుట్టినరోజుకు కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేస్తానని చిన్నమ్మాయి పద్మినీ ప్రియదర్శిని ఇంటికి తాను వెళుతున్నానని కృష్ణ అన్నారు.

కరోనా విజృంభణ తర్వాత తాను ఆఫీస్ కు వెళ్లడం కూడా మానేశానని కృష్ణ పేర్కొన్నారు.

పుస్తకాలు, పేపర్లు చదువుతూ కాలక్షేపం చేస్తున్నానని కృష్ణ వెల్లడించారు.విజయనిర్మల లేని లోటు గురించి మాట్లాడుతూ విజయనిర్మల భార్యే అయినప్పటికీ తాము మంచి ఫ్రెండ్స్ లా ఉండేవాళ్లమని కృష్ణ పేర్కొన్నారు.

విజయనిర్మల ఉన్నప్పుడు తనకు టైమ్ తెలిసేది కాదని ఎలాంటి లోటు చూసుకోవడంతో పాటు నిద్ర వచ్చేవరకు కబుర్లు చెప్పేదని కృష్ణ పేర్కొన్నారు.

జీవితమంతా విజయనిర్మల తనతోనే ఉంటుందని కృష్ణ అన్నారు.తాను షూటింగ్ ల కొరకు విదేశాలకు వెళ్లిన సమయంలో కూడా విజయనిర్మల తన కోసం వంట చేసేవారని కృష్ణ వెల్లడించారు.

ఇంటి ఆవరణలో విజయనిర్మల విగ్రహాన్ని ప్రతిష్టించామని విజయనిర్మలను చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విగ్రహాన్ని చూస్తే కూడా అదే విధంగా ఉందని ఆమె తెలిపారు.

"""/"/ పద్మాలయ సంస్థపై ప్రేమకథా చిత్రమ్ సీనిమాను హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నామని కృష్ణ అన్నారు.

హిందీలో పాతాళ భైరవి సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నామని వీలైతే హృతిక్ రోషన్ తోనే ఆ సినిమాను తెరకెక్కిస్తామని ఆమె పేర్కొన్నారు.

"""/"/ జగ్గయ్యతో తనకు మంచి అనుబంధం ఉందని జగ్గయ్య నిర్మాతగా తెరకెక్కిన పదండి ముందుకు సినిమాలో తాను తొలిసారిగా నటించానని కృష్ణ తెలిపారు.

ఆ సినిమా తర్వాత తేనె మనసులు సినిమాలో తాను హీరోగా నటించానని జగ్గయ్య గారు షూటింగ్ కు లేటుగా వచ్చినా చూసీచూడనట్లు ఉండేవాళ్లమని కృష్ణ పేర్కొన్నారు.

ఎన్నికలవేళ పవన్ కళ్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!!