2023 లో హీరో కార్తీ ఎన్ని సీక్వెల్ సినిమాలతో వస్తున్నాడో తెలుసా ?
TeluguStop.com
దండయాత్ర ఇది దయా గాడి దండయాత్ర.తారక్ చెప్పిన ఈ డైలాగ్ చాల పాపులర్.
ప్రస్తుతం హీరో కార్తీ ఈ డైలాగ్ ని నిజం చేస్తూ వచ్చే ఏడాది సీక్వెల్ సినిమాలతో దండయాత్ర చేయడానికి వచ్చేస్తున్నాడు.
సీక్వెల్ సినిమాలు చేయడం కొత్త విషయం ఏమి కాదు.ఒక సినిమా హిట్ అయ్యిందంటే దానికి సీక్వెల్ చేయడం పరిపాటి గా మారిపోయింది.
ఇక బాహుబలి, కెజిఎఫ్, కార్తికేయ సినిమాలు సీక్వెల్స్ తో వచ్చి హిట్ అయ్యి మరిన్ని సీక్వెల్ సినిమాలు తీయడానికి ఊతం ఇచ్చాయి.
ఇది ఇలా ఉంటె హీరో కార్తీ సైతం ఏకంగా మూడు సీక్వెల్ సినిమాలతో అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
H3 Class=subheader-styleపొన్నియన్ సెల్వన్/h3p """/"/
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బారి బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్.
ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల అయినా ఒక్క తమిళ నాట మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అయితే ఈ సినిమాకు మొదటి భాగం విడుదల కాకముందే సీక్వెల్ అన్నౌన్స్ చేసారు చిత్రం బృందం.
ఈ సినిమా రెండవ భాగం 2023 లో విడుదల అవ్వడానికి సంసిద్ధం అవుతుంది.
తెలుగు అభిమానులను నిరాశపరిచిన ఈ సినిమా మాత్రం తమిళ ప్రేక్షకుల హృదాలయాను గర్వపడేలా చేసింది.
ఇక మొదటి భాగంలో కార్తీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.h3 Class=subheader-styleఖైదీ/h3p """/"/
కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు, తమిల్ ప్రజలను బాగా ఆకర్షించింది.
నిజ జీవితంలో జరిగిన ఒక కథను సినిమాగా మలిచి మంచి మార్కులు కొట్టేసాడు హీరో కార్తీ.
ఈ చైనాకు సీక్వెల్ గా తీయాలని ఇప్పటికే టీమ్ అంత కూడా డిసైడ్ అయ్యారట, త్వరలోనే ఈ విషయానికి సంబందించిన ఆఫీసియల్ ప్రకటన రాబోతుంది.
దాంతో 2023 లో ఖైదీ 2 కూడా విడుదల అవుతుందట.h3 Class=subheader-styleసర్దార్/h3p """/"/
ఇక దివాళి కానుకగా తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సర్దార్.
ఈ చిత్రం లో తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ లో నటించిన కార్తీ ప్రేక్షులకు మంచి దీపావళి కానుక ఇచ్చాడు.
ఈ సినిమా రెండు భాషల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.దాంతో ఈ సినిమాకు సైతం సీక్వెల్ ఉండబోతుందని అన్నౌన్సు చేసారు మేకర్స్.
ఈ సినిమా సైతం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.
గీత దాటబోతున్న బన్నీ వాసు… ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్?