సంపాదిస్తున్న దాంట్లో 90% దానం చేస్తున్న హీరో .. ఎందుకో తెలుసా ?
TeluguStop.com
చెన్నై 600028 సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండో దశాబ్దాలుగా పలు సినిమాలతో సౌత్ ఇండియా లోనే స్టార్ హీరోగా ఎదిగాడు జై.
తమిళం మ్యూజిక్ కంపోజర్ అయిన దేవా కి వారసుడిగా మ్యూజిక్ కంపోజర్ గానే ఇండస్ట్రీకి దొరుకు ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చాడు.
జర్నీ, రాజా రాణి, గోవా డేస్ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.
గత మూడేళ్లుగా లాంగ్ టైం కారణంగా ఎలాంటి సినిమాలు విడుదల చేయని జై 2022లో ఇప్పటికే మూడు సినిమాలు విడుదల చేయడమే కాకుండా మరో ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
"""/"/
జై సినిమాల ద్వారా బాగానే ఆదాయం సంపాదిస్తున్నాడు అంతేకాదు వ్యక్తిగత జీవితంలోనూ పలు వివాదాలతో సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నాడు.
ఇక మ్యూజిక్ కంపోజిషన్ అంటే ఎంతో ప్రాణం అని చెప్పే జై తన తల్లి క్యాన్సర్ తో చనిపోవడంతో కొన్నాళ్లపాటు డిప్రెషన్ లోకి వెళ్ళాడు.
అందుకే ఒక మ్యూజిక్ బ్యాండ్ కూడా నడిపిస్తున్నాడు జై ఈ బ్యాండ్ ద్వారా వచ్చే 90 శాతం ఆదాయాన్ని క్యాన్సర్ బాధితుల కోసం దానం చేస్తుండడం విశేషం.
తన తల్లి లాగా మరెవరు కూడా క్యాన్సర్ తో చనిపోకూడదనేది జై యొక్క ముఖ్య ఉద్దేశం.
"""/"/
ఇక 38 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు జై.
పలు హీరోయిన్స్ తో ఎఫైర్స్ బాగానే కొనసాగిస్తున్న ఆ పెళ్లి మాట చెబితే చాలు పారిపోతున్నాడు.
ఇంకా కొన్ని రోజులాగితే పెళ్లి చేసుకున్న లాభం లేదు అంటూ ప్రేక్షకులు జై త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు.
అయితే ఇటీవలే నటి వాని భోజన్ తో జై కి బ్రేకప్ అయ్యింది అనే వార్తలు కూడా ప్రస్తుతం తమిళ మీడియా కోడై కూస్తోంది.
ఇక వానికి ముందు తెలుగు హీరోయిన్ అంజలి తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించాడు జై.
సింగర్ నిఖిత గాంధీ పెద్ద మనసు .. రాజస్థాన్ ఎన్జీవో కోసం యూకేలో ప్రత్యేక ప్రదర్శన