నాగార్జున భారీ స్థాయిలో ఆస్తులు సంపాదించడానికి అదే కారణం… జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నవారిలో సీనియర్ నటులు నాగార్జున (Nagarjuna) ఒకరు.
ఈయన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా కొనసాగారు.
ఇక నాగార్జున కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో వ్యాపారాలను చేస్తున్నారు.అలాగే అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను కూడా ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు.
ఇలా అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నటువంటి నాగార్జున భారీ స్థాయిలో ఆస్తులను కూడా కూడబెట్టిన సంగతి తెలిసిందే.
"""/" /
ఈ విధంగా నాగార్జున తండ్రి నుంచి వారసత్వంగా కొంత ఆస్తిని పొందినప్పటికీ ఈయన కూడా భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారు.
అయితే నాగార్జున ఇలా ఆస్తులను సంపాదించడం వెనుక ఉన్నటువంటి కారణాన్ని జగపతిబాబు (Jagapathi Babu) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు నాగార్జున తనకు చాలా క్లోజ్ అని తెలిపారు.
నేను నాగార్జునని ముద్దుగా చౌ అని పిలుస్తానని నేను తప్ప ఇండస్ట్రీలో తనని ఎవరు అలా పిలవరని తెలిపారు.
ఆయన కూడా నన్ను అలాగే పిలుస్తారని.ఇక మా పేర్లలో చౌదరి అని ఉండటం వల్ల అలా పిలుచుకుంటామని తెలిపారు.
"""/" /
ఇక నాగార్జున నేను రెండు రోజులకు ఒకసారైనా కలుస్తూ ఉంటామని జగపతిబాబు తెలిపారు.
నాగార్జున ఆస్తుల గురించి మాట్లాడుతూ నాగార్జున ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించడం వెనుక కారణమేంటంటే ఆయన ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే ఆ బిజినెస్ వ్యవహారాలన్నింటిని ఆయనే దగ్గరుండి చూసుకుంటారు.
అందులోకి ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వరు.అదే తన సక్సెస్ సీక్రెట్ అంటూ ఈ సందర్భంగా జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యువకులను మాత్రమే డేటింగ్ చేసే వృద్ధురాలు.. కారణం తెలిస్తే షాకే..