గోపీచంద్ పరిస్థితి దారుణం.. నెల జీతానికి పని చేస్తున్న హీరో?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో గోపీచంద్( Hero Gopichand ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట తొలివలపు సినిమాతో సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ హీరోగా విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు గోపీచంద్.
కాగా గోపీచంద్ జయం,వర్షం సినిమాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం,లౌక్యం, జిల్, చాణక్య, పంతం, పక్కా కమర్షియల్, సిటీ మార్, గౌతమ్ నంద లాంటి సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు గోపీచంద్.
"""/" /
సిటీమార్ సినిమా( Seetimaarr Movie )తో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే గత ఏడాది పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇక చివరిగా గోపీచంద్ రామబాణం సినిమా( Ramabanam )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.దీంతో గోపీచంద్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.
ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో రెమ్యూనరేషన్ విషయంలో ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి.
హీరో గోపీచంద్ కి అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. """/" /
అయితే ఒకప్పుడు రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్( Gopichand Remuneration ) ని తీసుకునే గోపీచంద్, ఇప్పుడు నెల జీతం లెక్క పని చెయ్యడానికి ఒప్పుకున్నాడట.
అలా ఒక సినిమా మీద ఎన్ని నెలలు పని చేస్తే అంత రెమ్యూనరేషన్ అన్నమాట.
నెలకి ఎంత అనేది మాత్రం తెలియలేదు.కాగా ఈ వార్త విని ఆయన అభిమానులు ఎలాంటి రేంజ్ లో ఉండాల్సిన హీరో, ఇలా అయ్యిపోయాడేంటి అని బాధపడుతున్నారు.
అంతేకాకుండా గోపిచంద్ కెరీయల్లో ఇప్పుడు ఒక్క సూపర్ హిట్ సినిమా పడింది అంటే మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!