కొడుకు కోసం రంగంలోకి దిగిన బాలయ్య… మామూలుగా ఉండదు….

తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి హీరోలకు ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఇందులో స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు వారసులుగా స్వర్గీయ నటుడు హరికృష్ణ, బాలకృష్ణ, యువరత్న, తదితరులు సినీ పరిశ్రమకి హీరోలుగా పరిచయమయ్యారు.

అయితే ఇందులో హరికృష్ణ వారసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లు హీరోలుగా పరిచయమై అదరగోడుతున్నారు.

దీంతో ఇక ఇప్పుడు బాలయ్య బాబు వంతు వచ్చింది.దీంతో బాలయ్య బాబు అభిమానులు కూడా తన వారసుడు మోక్షజ్ఞ సినిమా పరిశ్రమ ఎంట్రీ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

అయితే మోక్షజ్ఞ మాత్రం బయట కనిపించినప్పుడల్లా బాలయ్య బాబు అభిమానులను కలవర పెడుతూనే ఉన్నాడు.

అంతే గాక బాలయ్య బాబు కూడా ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి  ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లోకి రావాలా.

 వద్దా అనే నిర్ణయం పూర్తిగా మోక్షజ్ఞ కే వదిలేశానానని అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య బాబు తన కొడుకుని హీరోగా పరిచయం చేసేందుకు తానే సొంతంగా ఓ కథని సిద్ధం చేస్తున్నట్లు పలు కథనాలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

అంతేకాక ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న ఈ కరోనా వైరస్ కారణంగా షూటింగులు లేకపోవడంతో స్క్రిప్టు పనులు పూర్తి చేసినట్లు సమాచారం.

అయితే మరోపక్క మోక్షజ్ఞని టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత