బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ ఇదే.. తండ్రి పేరు గుర్తుకు వచ్చేలా?

క్రాక్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఆ సినిమా సక్సెస్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టైటిల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చినా చివరికి అన్నగారు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది.

ఈ టైటిల్ కు యూనిట్ సభ్యుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని బోగట్టా.

సరికొత్త కథాంశంతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

కొన్నిరోజుల క్రితం ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ వినిపించినా టైటిల్ రొటీన్ గా ఉందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ను అందరూ అన్నగారు అని పిలిచేవారనే సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

"""/"/అన్నగారు టైటిల్ బాలయ్యకు బాగా సూట్ అవుతుందని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

"""/"/ అఖండ సినిమా తొలి అక్షరం అ కాగా ఈ సినిమా తొలి అక్షరం కూడా అ తో మొదలు కావడం గమనార్హం.

బాలయ్య తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధికి నటుడు రావు రమేష్ భారీ విరాళం..!!