భార్య కోసం నిర్మాతగా మారుతున్న మరో కోలీవుడ్ హీరో

పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్స్ కొంత విరామం తీసుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్ లో కొంత మంది భామలు సిస్టర్ పాత్రలు, అలాగే తల్లి పాత్రలకి పరిమితం అయిపోతూ ఉంటే మరికొందరు కొత్త కథలతో సినిమాలు చేస్తూ విమేల్ సెంట్రిక్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నారు.

మరికొంత మంది పెళ్లి తర్వాత కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా సక్సెస్ అవుతున్నారు.

అలాగే పెళ్లి తర్వాత హీరోయిన్ గా సక్సెస్ అయిన వారిలో రాధికా ఆప్టే ఉంది.

దీపికా పదుకునే, విద్యాబాలన్, ప్రియాంకా చోప్రా లాంటి భామలు పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గానే కొనసాగుతున్నారు.

ఇక కోలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక ఏకంగా పదేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించి హీరో సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

తరువాత ఓ ఐదేళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నటిగా రీఎంట్రీ ఇచ్చింది.సూర్య సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి భార్యతో లేడీ ఒరియాంటెడ్ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాల మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని ఇప్పుడు కోలీవుడ్ లో ఫిమేల్ సెంట్రిక్ కథలకి జ్యోతిక కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ హీరో భార్య కోసం నిర్మాతగా మారుతున్నాడు.

కోలీవుడ్ లో నటుడుగా విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆర్య బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే నటిగా మంచి భవిష్యత్తు ఉన్న ఆమె కెరియర్ ని కొనసాగించడానికి ఇప్పుడు భర్త ఆర్య ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాడు.

భార్య కోసం ఫిమేల్ సెంట్రిక్ కథలని వింటూ నిర్మాతగా మారి ఆమెని ప్రోత్సహించాలని అనుకుంటున్నాడు.

ఇప్పటికే ఒక కథ విని నచ్చి ఒకే చేసినట్లు తెలుస్తుంది.

ప్రభాస్ కల్కి కోసం రంగం లోకి దిగిన తెలుగు స్టార్ హీరో…