అర్జున్ ఫ్యామిలీ నుండి ఇంత మంది హీరో హీరోయిన్స్ ఉన్నారా..?

యాక్షన్ కింగ్ అర్జున్ అంటే చాలు మనందరికి బాగా గుర్తొచ్చేది.ఒకేఒక్కడు సినిమా.

తెలుగు, తమిళం భాషల్లో  ఈ సినిమా ఆడినట్టు ఏ సినిమా ఆడలేదు.ఇప్పటికి ఈ సినిమా టీవీల్లో వస్తే రిమోట్ తిప్పకుండా చూస్తారు.

ఇందులో ఉండే ఒక్కరోజు సీఎం కాన్సెప్ట్ అయితే నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి.

అయితే అర్జున్ కన్నడ హీరో అయినా తెలుగులో ఉన్న టాప్ హీరోస్ లో ఒకరిలా మన తెలుగు హీరోలలో కలిసిపోయాడు.

అయితే ప్రెసెంట్ ఇప్పుడు అర్జున్ కి 56 సంవత్సరాలు.ఈయన 1964 ఆగస్టు 15 న కర్ణాటకలో జన్మించారు.

అర్జున్ అసలు పేరు శ్రీనివాస సర్జా! ఈయన సినిమా లైఫ్ లో ఒకేఒక్కడు, జెంటిల్ మ్యాన్, మా ఊరి గోపాలుడు, మంజునాథ, శ్రీ ఆంజనేయం, పుట్టింటికి రా చెల్లి లాంటి ఎన్నో సినిమాలను మనం ఎప్పటికి మరచిపోలేము.

యాక్షన్ కింగ్ అర్జున్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు కానీ అర్జున్ ఫ్యామిలీ గురించి మాత్రం మనకు పెద్దగా తెలియదు.

అర్జున్ మొత్తం ఫ్యామిలీ సినిమాలకు సంబంధించిన వారే అని మీకు తెలుసా? అర్జున్ ఫామిలీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

"""/"/ ముందు మనం అర్జున్ నాన్నగారు.శక్తి ప్రసాద్ గురించి మాట్లాడుకోవాలి ఈయన ఒకప్పటి కన్నడ మూవీస్ లో ఫేమస్ విలన్.

  ఈయన డైలాగ్స్ కూడా చాల బాగా చెప్తారట.ఇంకా అర్జున్ కి పిల్లనిచ్చిన మామగారు రాజేష్ గారు కూడా కన్నడ ఫేమస్ వెటరన్ యాక్టర్.

సో, వీళ్ళ ద్వారా అర్జున్ సినిమాల్లోకి వచ్చి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు.  ఇక అర్జున్ ఇద్దరు కూతుళ్లు ఇప్పటికే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

"""/"/ ఇక ఆతర్వాత అర్జున్ భార్య ఆషారాణి గురించి మాట్లాడుకోవాలి.ఈమె కూడా ఒకప్పుడు కన్నడలో ఒక ఫెమస్ హీరోయిన్.

ఈమె ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో కలిపించారు.ఇక అర్జున్ అన్నయ్య కిషోర్ షార్జా కన్నడలో ఫేమస్ డైరెక్టర్.

ఈయన తీసింది 6 సినిమాలైనా అన్ని హిట్ సినిమాలే తీశారు.అయితే ఈయనకు బాగా డ్రింకింగ్ హబిట్ ఉండడం వలన కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయారు.

"""/"/ ఇక హీరో అర్జున్ కి ముగ్గురు మేనళ్లుడులు వున్నారు ముగ్గురు హీరోలే.

వారిలో మనం ముందు చిరంజీవి షార్జా గురించి మాట్లాడుకోవాలి.ఈయన కన్నడలో పందెంకోడి సినిమా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఆతర్వాత కూడా తెలుగు, తమిళ్ లో సూపర్ హిట్ అయినా సినిమాలను రీమేక్ చేస్తూ కన్నడలో తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అయితే 6 జూన్ 2020 అర్ధరాత్రి ఈయనకు సడన్ గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చి చనిపోయాడు.

చిరంజీవి భార్య మేఘన రాజ్ కూడా హీరోయిన్ గా పని చేసింది.మన తెలుగు లో సైతం ఆమె బాగానే నటించింది.

"""/"/ ఇక రెండొవ తమ్ముడు ధ్రువ సర్జా గురించి మాట్లాడుకుంటే.ఈయన ప్రెసెంట్ కన్నడలో నెంబర్ వన్ హీరోగా దూసుకెళ్తున్నాడు.

అద్దూరి, బహద్దూర్, భార్జారీ, పొగరు లాంటి సినిమాలతో కన్నడ కింగ్ గా అందరిని .

ఇక అర్జున్ అల్లుళ్ళలో ఆఖరివాడు భరత్ సర్జా.ఈయన పులకేసి అనే సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇంకా ఇప్పుడు కూడా మంచి మంచి కధలు వింటూ ఎలాగైనా కన్నడ సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

"""/"/ ఇక ఫైనల్ గా అర్జున్ కూతుర్ల గురించి మాట్లాడుకోవాలి.అర్జున్ కి ఇద్దరు కూతుర్లున్నారు.

ఐశ్వర్య అండ్ అంజనా.పెద్దమ్మాయి ఐశ్వర్య 2013 లోనే విశాల్ ధీరుడు సినిమలో హీరోయిన్ గా తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.ఇక రెండో అమ్మాయి అంజనా కూడా ఇవ్వాలో రేపు సినిమాల్లోకే అడుగుపెట్టాలని ట్రై చేస్తుంది.

అదండీ ఇక్కడ మన తెలుగులో చిరంజీవి ఫ్యామిలీలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కుటుంబం మొత్తం సినిమా స్టార్స్ కావడం విశేషం.

ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ప్రభాస్ కొత్త లుక్.. జాగ్రత్త పడకపోతే ఇబ్బందేనా?