తండ్రి చనిపోయిన 10 రోజులకే పనిలో చేరిన కుర్రాడు.. సాయం చేస్తానన్న హీరో మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఊహించని స్థాయిలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.

ఆ కష్టాలు ఆర్థికపరమైన కష్టాలు అయితే మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సంపాదించే మనిషి దూరమైతే ఆ కుటుంబానికి ఎదురయ్యే కష్టాలు అన్నీఇన్నీ కావు.తండ్రి మరణిస్తే కొన్ని సందర్భాల్లో పిల్లలపై వయస్సుకు మించిన భారం పడుతుంది.

ఢిల్లీకి చెందిన జన్ ప్రీత్ ( Jaspreet ) అనే పిల్లవాడు తండ్రిని కోల్పోవడం వల్ల తండ్రిలా చపాతీలను తయారు చేసే పనిలో చేరాడు.

జన్ ప్రీత్ వయస్సు 10 సంవత్సరాలు కాగా చిన్న వయస్సులోనే కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత అతనిపై పడింది.

జన్ ప్రీత్ తల్లి పంజాబ్ లో నివశిస్తుండగా జన్ ప్రీత్ అతని సోదరితో కలిసి ఢిల్లీలో( Delhi ) తన బంధువుల ఇంట్లో ఉన్నారు.

"""/" / ఒక ఫుడ్ వ్లాగర్ ద్వారా జన్ ప్రీత్ కష్టాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

జన్ ప్రీత్ గురించి తెలిసి ఇప్పటికే ఆనంద్ మహీంద్రా,( Anand Mahindra ) ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ తనకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

జన్ ప్రీత్ గురించి తెలిసి బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్( Hero Arjun Kapoor ) తన వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

"""/" / ఈ పది సంవత్సరాల బాలుడు చిరునవ్వుతో కష్టాలను దాటేందుకు ప్రయత్నిస్తున్నాడని ఈ బుడ్డోడి గుండె ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని అర్జున్ కపూర్ తెలిపారు.

జన్ ప్రీత్ అతని సోదరి చదువుకు నేను సహాయం చేస్తానని అర్జున్ కపూర్ కామెంట్లు చేశారు.

అర్జున్ కపూర్ మనస్సు మంచి మనస్సు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

డాకు మహారాజ్ రివ్యూ & రేటింగ్