40 ఏళ్ళ కెరీర్ లో అర్జున్ ని ఇంత గా ఎవరు అవుమానించలేదట ?

రాణి రాణమ్మ.ఆనాటి నవ్వులు ఏవమ్మా అంటూ యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

ఇక భజే మంజునాథ అంటూ తనలోని మరొక యాంగిల్ ని కూడా ప్రేక్షకులకు చూపించాడు.

ఒక ఫైటర్ గా, ఒక భక్తుడిగా, ఒక మాస్ హీరో అయినా, చివరికి లవర్ బాయ్ అయినా, విలనీ వేషం అయినా అర్జున్ కి సాటి లేరు ఎవరు.

ఇండస్ట్రీ లో ఒక హీరో గురించి మరొక హీరో తిట్టుకోవడం, పైకి చూపించపోయిన ఇగో క్లాషెస్ రావడం సాధారణం.

ఎంత మంది హీరోలు ఉన్నా కూడా అందరు ఉమ్మడిగా ప్రేమించేది మాత్రం కేవలం హీరో అర్జున్ ని మాత్రమే.

అంత నటులను ఫ్యాన్స్ గా మార్చుకున్న ఆర్టిస్ట్ అతడు.అలంటి ఒక ఆర్టిస్ట్ ను సైతం మన తెలుగు హీరో విశ్వక్ సేన్ ఇర్రిటేట్ చేసాడు.

మాములుగా కాదు.అస్సలు ఆ కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి చాల రోజులే అవుతున్న సరైన సక్సెస్ అయితే దొరకలేదు.

దాంతో తానే ప్రొడ్యూసర్ గా మరి దర్శకత్వం చేపడుతూ తన కూతురిని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా తీయాలనుకున్నాడు.

హీరో గా మన ఓవర్ ఆటిట్యూడ్ స్టార్ అయినా విశ్వక్ సేన్ ని పెట్టుకున్నాడు.

అంత అనుకున్నట్టుగానే షెడ్యూల్ కూడా అనుకున్నారు.స్టార్ట్ అవవడానికి ముందు సరిగ్గా విశ్వక్ సేన్ నుంచి ఒక మెస్సేజ్ వచ్చింది.

సారీ అంటూ చెప్పాడు.దాంతో షూట్ క్యాన్సిల్.

"""/"/ పోనీ అతడిని కాంటాక్ట్ చేద్దాం అంటే అవతల వైపు నుంచి నో ఆన్సర్.

అతడి మేనేజర్ తో మాట్లాడుదాం అని ప్రయత్నిస్తే నేను మళ్లి ఫోన్ చేస్తాను అంటూ చెప్పి ఫోన్ కట్ చేసాడట.

దాంతో అర్జున్ కి చిర్రెత్తుకచ్చింది.ఇన్నేళ్ల కెరీర్ లో ఎవరితో వివాదాలు లేని ఒక హీరో స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చెప్పడం బట్టి చూస్తే అర్జున్ ఎంతలా హర్ట్ అయ్యాడో మనం అర్ధం చేసుకోవచ్చు.

మరి విశ్వక్ సేన్ ఇలా చేయడానికి గల ముఖ్యం కారణం ఆ సినిమాకు డైలాగ్స్ రాసిన బుర్ర సాయి మాధవ్ పని తనం నచ్చకపోవడం వల్లనట.

సో అర్జున్ విశ్వక్ సేన్ ని పీకేసాడు.ఈ ఎపిసోడ్ చూసాక టీవీ 9 దేవి నువ్వు కరెక్ట్ అనకుండా ఉండలేం కదా.

మరి ఇంత ఆటిట్యూడ్ పనికి రాదు బాసు.ఒక హీరో కు ఆ సినిమాలో హీరోయిన్ నుంచి మొదలు చాయ్ ఇచ్చే బాయ్ వరకు అందరు నచ్చి తీరాలి అనే పట్టుదల, పోకడ కాస్త తగ్గించుకుంటే మంచిది.

రోజూ రొట్టెలు పెట్టిన మహిళకు కన్నీటి వీడ్కోలు పలికిన మూగజీవం.. వీడియో చూస్తే!