బిగ్ బాస్ 6 హోస్ట్ గా ఐకాన్ స్టార్..?

బిగ్ బాస్ సీజన్ 5 మరో 3 వారాల్లో పూర్తి కానుంది.ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ కు మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా తీసుకు వచ్చేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

బిగ్ బాస్ 6 హోస్ట్ గా మళ్లీ నాగార్జుననే చేస్తాడా లేక ఎవరైనా స్టార్ ని దించుతారా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని హోస్ట్ గా దించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్.టి.

ఆర్ హోస్ట్ గా చేశారు.రెండవ సీజన్ నాని హోస్ట్ చేయగా 3,4,5 వ సీజన్లు నాగ్ హోస్ట్ గా చేస్తూ వచ్చారు.

ఇక సీజన్ 6 విషయంలో నాగ్ బదులుగా అల్లు అర్జున్ ని హోస్ట్ గా తీసుకురావాలని స్కెచ్ వేస్తున్నారు.

ఆల్రెడీ అల్లు అర్జున్ కూడా సిల్వర్ స్క్రీన్ ఆడియెన్స్ మాత్రమే కాదు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరించాలనే ఆలోచనలో ఉన్నాడట.

అందుకే బిగ్ బాస్ సీజన్ 6 తప్పకుండా హోస్ట్ గా వచ్చే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.

ఒకవేళ బన్నీ బిగ్ బాస్ హోస్ట్ అయితే మాత్రం టి.ఆర్.

పి రేటింగ్ అదిరిపోతుందని చెప్పొచ్చు.

ఇల్లు కట్టేసింది … ఇక పెళ్లెప్పుడు… సోషల్ మీడియాలో పూజ హెగ్డే పెళ్లి వార్త వైరల్..!