సోషల్ మీడియాకి దూరంగా స్టార్ హీరో! ఫేక్ అకౌంట్స్ తో తప్పుదోవా
TeluguStop.com
స్టార్ హీరోల క్రేజ్ ని ఉపయోగించుకొని సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఏవో ఒక తప్పుడు పనులు చేయడం, లేదంటే వివాదాస్పద పోస్టులు పెట్టడం చేస్తూ ఉంటారు.
కొంత మంది మరింత శృతి మించి ఆ స్టార్ హీరో అభిమానులని ట్రాప్ చేస్తూ ఉంటారు.
తాజాగా విజయ్ దేవరకొండ పేరుతో ఓ వ్యక్తి పేస్ ఎకౌంటు క్రియేట్ చేసి అమ్మాయిలని మోసం చేసిన ఉదంతం మరిచిపోక ముందే తమిళ స్టార్ హీరో తలైవిగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫాన్స్ ని తప్పుదోవా పట్టిస్తున్నాడు.
అజిత్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కాష్ చేసుకోవాలని ఫేక్ అకౌంట్ ని ప్రచారంలోకి తీసుకొచ్చారు.
అది నిజంగా అజిత్ దే అనుకోని ఆ అకౌంట్ ని ఫాన్స్ ఫాలో అవ్వడం మొదలెట్టారు.
దీనిపై అజిత్ కు సంబదించిన టీం క్లారిటీ ఇచ్చింది.అజిత్ కి ఎటువంటి పేస్ బుక్ అకౌంట్ లేదని, ప్రచారం జరుగుతున్నట్లు అది అజిత్ అధికారిక అకౌంట్ కాదని ఓ ప్రకటన విడుదల చేశారు.
దీనిపై అజిత్ కి సంబంచిందిన లీగల్ టీమ్ నోట్ విడుదల చేశారు.ప్రస్తుతం అజిత్ వాలిమై చిత్రంలో నటిస్తున్నాడు.
హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కుతుంది.ఇదిలా ఉంటే తనకి సోషల్ మీడియా మీద పెద్దగా ఆసక్తి లేదని అందుకే వాటిని దూరంగా ఉంటున్నట్లు అజిత్ కూడా ప్రకటించాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపంగా మారిన రెమ్యునరేషన్లు.. చిన్న హీరోకు అన్ని కోట్లా?