తొలితరం సూపర్ స్టార్.. కానీ, జనాలకు కవిగానే సుపరిచితం..

కొసరాజు రాఘవయ్య చౌదరి.వందలాది సినీ పాటలు రాసి.

అద్భుత కవిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు.కొసరాజు చదువు పూర్తి కాగానే మద్రాసు బాటపట్టాడు.

యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు, భజనగీతాలు, జముకుల కథలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు సహా ఎన్నో పాటలు రాశాడు.

తెలుగు పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.వ్యంగ్యం, హాస్యం కలగలిపి రచనలు చేసేవాడు రాఘవయ్య.

ఆరోజుల్లో పలువురు నిర్మాతలు ఆయన చేత పాటలు రాయించుకునేందుకు.ఆయన ఇంటి చుట్టూ తిరిగేవారు.

సినిమా జనాలకు కావాల్సిన విధంగా వందలాది పాటలు రాశాడు కొసరాజు.జానపద పాటలకు లాలిత్యాన్ని, సాంఘిక పాటలకు పొగరును అద్దాడు కొసరాజు.

ఆయన ఏ పాట రాసినా ఈ ముద్ర ప్రస్పుటంగా కనిపించేది.కొసరాజుకు హాస్యం అంటే అమితమైన ప్రేమ.

అందుకే ఆయన పాటల్లో హాస్యం అనేది తప్పనిసరిగా తొణికిసలాడేది.అంతేకాదు.

ఆయన చేసే విమర్శల్లో కూడా హాస్యం అనేది కనిపించేది.అంతేకాదు.

నాటి సామాజిక సమస్యలపైనా విమర్శలు అధికంగా చేసేవాడు ఆయన. """/"/ కొసరాజు హీరోగా కూడా నటించాడు.

1939లో వచ్చిన రైతు బిడ్డ అనే సినిమాలో ఆయన హీరోగా చేశాడు.అప్పట్లో తెలుగు సినిమాకు అంతగా గుర్తింపు లేదు.

అందుకే ఆయన జనాలకు పెద్దగా తెలియదు.కానీ తెలుగులో మొదటి సూపర్ స్టార్ కొసరాజుగా చెప్పుకోవచ్చు.

"""/"/ కొసరాజు గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి, ఆయన ఊరు చింతాయపాలెం గురించి తెలియని తెలుగు ప్రజలు అప్పట్లో ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు.

1939-40 కాలంలో చాలా మంది జనాలు ఆయన సొంతూరుకు వెళ్లి ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను చూసి వచ్చేవారు జనాలు.

మాత్రం ఎంతో పేరు తెచ్చాడు కొసరాజు.మొత్తం మీద తెలుగు సినిమాల్లో మొదటి తరం సూపర్ స్టార్ గా ఆయన పేరు చెప్పుకోవచ్చు.

కానీ చాలా మందికి ఆయన కవిగానే గుర్తుండి పోయాడు.అప్పట్లో తెలుగు సినిమాకు గుర్తింపు ఉంటే ఆయన ఖ్యాతి మరోలా ఉండేది.

తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ..!!