అవసరం లేని వాట్సాప్ ఫైల్స్ సింపుల్‌గా ఇలా డిలీట్ చేసుకోండి..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జీవితాల్లో వాట్సాప్ అనేది ఒక భాగం అయిపోయింది.

ఎవరితో కమ్యూనికేట్ కావాలన్నా చాలామంది వాట్సాప్ పైనే ఆధారపడుతున్నారు.దీని ద్వారానే ఇంటర్నెట్ యూజర్లు చాలా మీడియా కంటెంట్ సెండ్ చేయడం, అందుకోవడం జరుగుతోంది.

దీనివల్ల ఫోన్ల స్టోరేజ్ నిండిపోతుంది.కాగా అనవసరమైన ఫైల్స్ డిలీట్ చేసి ఫోన్ స్టోరేజ్ ఫ్రీ చేసుకోవడం తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఒక సింపుల్ ట్రిక్ తెలుసుకుంటే అనవసరమైన వాట్సాప్ ఫైల్స్ అన్నీ ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు.

ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.వాట్సాప్ అన్‌వాంటెడ్ ఫైల్స్ డిలీట్ చేయడానికి యాప్ ఓపెన్ చేసి త్రీ డాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

ఆపై సెట్టింగ్స్ కి వెళ్లి మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అప్పుడు వాట్సాప్ ఫైల్స్ డేటా (ఫోన్ మెమొరీ) అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.

అక్కడ లార్జర్ దెన్ 5ఎంబీ ఫైల్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేసిన తరువాత లార్జ్ సైజు ఫైల్స్ ప్రత్యక్షమవుతాయి.

"""/" / వాటిలో అనవసరమైన ఫైల్స్ సెలక్ట్ చేసుకుని డిలీట్ చేయవచ్చు.డేటా ఎక్కువగా స్టోర్ అయిన కాంటాక్ట్స్‌ లిస్ట్ వైజ్‌గా కూడా కనిపిస్తాయి.

బాగా ఇంపార్టెంట్ కాని కాంటాక్ట్స్‌కి పంపించినవి వెంటనే మీరు డిలీట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఇకపోతే ఏడాదిలో వాట్సాప్ ఇప్పటికే చాలా ఫీచర్లను పరిచయం చేసింది.అవతార్స్ కూడా రీసెంట్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది.

టి. బిజేపి లో ఏం జరుగుతోంది ? నడ్డా టూర్ కి కారణం ఏంటి ?