వేట్టయాన్ టైటిల్ వివాదం గురించి క్లారిటీ ఇదే.. ఆ రీజన్ వల్లే పెట్టలేదంటూ?
TeluguStop.com
సూపర్ స్టార్ రజనీకాంత్ ( Superstar Rajinikanth )కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.
రజనీకాంత్ తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు.
మరికొన్ని గంటల్లో రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లైకా ప్రొడక్షన్స్ దృష్టికి ఈ వివాదం రావడంతో అధికారికంగా ఒక ప్రకటన వెలువడింది.
వేట్టయాన్ సినిమా( Vettayan Movie ) కోసం తెలుగులో వేటగాడు అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించాలని అనుకున్నమని తెలిపారు.
ఆ టైటిల్ అందుబాటులో లేకపోవడంతో ఒరిజినల్ పేరుతోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు.
ఇతర డబ్బింగ్ వెర్షన్లకు సైతం వేట్టయన్ : ది హంటర్ అనే పేరు పెట్టామని మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నామని మేకర్స్ వెల్లడించారు. """/" /
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమందితో కలిసి పని చేశామని మేకర్స్ అన్నారు.
ఆర్, సీతారామం సినిమాలను తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని మేకర్స్ పేర్కొన్నారు.మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.
తెలుగు భాష, తెలుగు ప్రేక్షకులు, తెలుగు మీడియాపై లైకా ప్రొడక్షన్స్ కు గౌరవం ఉందని లైకా నిర్మాతలు అన్నారు.
"""/" /
2 గంటల 43 నిమిషాల 25 సెకన్ల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.
వేట్టయన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.మంజు వారియర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.
వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో కూడా వరుస సినిమాలలో నటించడం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
రజనీకాంత్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్12, మంగళవారం 2024