రాబిన్ హుడ్ టికెట్ ధరల పెంపుపై క్లారిటీ ఇదే.. ఆ వార్తల్లో నిజం లేదంటూ?
TeluguStop.com
నితిన్ ,వెంకీ కుడుముల( Nithin, Venky Kudumula ) కాంబినేషన్లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా( Robin Hood Movie ) మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
అటు నితిన్ కెరీర్ లో ఇటు వెంకీ కుడుముల కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచారని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మైత్రీ నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చింది.
రాబిన్ హుడ్ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు( Ticket Rates
) పెంచినట్లు వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని వైరల్ అవుతున్న వార్తలు అన్నీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారంలోకి వస్తున్న వార్తలు అని మేకర్స్ చెప్పుకొచ్చారు.
సరసమైన ధరల్లోనే ప్రేక్షకులు రాబిన్ హుడ్ సినిమాను చూడాలనేది తమ ఆకాంక్ష అని మేకర్స్ చెప్పుకొచ్చారు.
"""/" /
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లోని ఎంపిక చేసిన ప్రీమియం ప్రాంతాల్లో మాత్రమే స్వల్పంగా హైక్ ఉంటుంది తప్ప మిగతా ప్రాంతాలలో హైక్ లేదని మేకర్స్ వెల్లడించారు.
సమీపంలోని థియేటర్లను సందర్శించి రాబిన్ హుడ్ సినిమాను ఎంజాయ్ చేయాలని మేకర్స్ పేర్కొన్నారు.
రాబిన్ హుడ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
రాబిన్ హుడ్ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. """/" /
రాబిన్ హుడ్ మూవీకి మ్యాడ్ స్క్వేర్ మూవీ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది.
కొన్ని ఏరియాలలో రాబిన్ హుడ్ తో పోలిస్తే మ్యాడ్ స్క్వేర్ మూవీకే బుకింగ్స్ భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.
ఈ రెండు సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
ఎట్టకేలకు నెరవేరిన చిరంజీవి పెద్ద కూతురు కోరిక.. ఆ సినిమాతో సక్సెస్ సాధిస్తారా?