బ‌ల‌హీనంగా మారిన కేశాల‌ను బ‌లంగా మార్చే సింపుల్ రెమెడీ మీకోసం!

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను-క‌ల‌ర్స్‌ను వాడ‌టం, త‌డి జుట్టును దువ్వ‌డం, బ్లో-డ్రైయ‌ర్స్ లేదా ఇత‌ర హీట్ స్టైలింగ్ ఉత్ప‌త్తుల‌ను అధికంగా వినియోగించ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కేశాలు బ‌ల‌హీనంగా మారిపోతాయి.

జుట్టు బ‌ల‌హీనం అవ్వ‌డం వ‌ల్ల హెయిర్ ఫాల్ స‌మ‌స్య విప‌రీతంగా పెరిగిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో అర్థంగాక‌.

ఎలా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవాలో తెలియ‌క‌.స‌త‌మ‌తం అవుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే బ‌ల‌హీనంగా మారిన కేశాల‌ను బ‌లంగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో చూసేయండి.ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల న‌ల్ల బియ్యం, వ‌న్ టేబుల్ స్పూన్ గోధుమ‌లు వేసుకుని వాట‌ర్‌తో ఒక‌సారి వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో గ్లాస్ వాట‌ర్ మ‌రియు వ‌న్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్ వేసుకుని బాగా క‌లిపి మూడు గంట‌ల పాటు వ‌దిలేయాలి.

మూడు గంట‌లు పూర్తి అయ్యాక స్ట్రైన‌ర్ సాయంతో వాట‌ర్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక ఉల్లిపాయ‌ను తీసుకొని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. """/"/ ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను వేరు చేయాలి.

ఆపై స్ట‌వ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి అందులో ఉల్లిపాయ ర‌సం మ‌రియు ముందుగా స‌ప‌రేట్‌ చేసి పెట్టుకున్న వాట‌ర్‌ను పోసి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

కంప్లీట్‌గా కూల్ అయ్యాక అందులో వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనెను క‌లిపి.

స్ప్రే బాటిల్‌లో నింపాలి.ఇప్పుడు త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు స్ప్రే చేసుకుని.

రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే బ‌ల‌హీనంగా మారిన కేశాలు దృఢంగా మార‌తాయి.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య దూరం అవుతుంది.

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన నిందితుడిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!