నత్తలతో ఫేషియల్... కాస్మెటిక్ ఇండస్ట్రీలో సంచలనం
TeluguStop.com
ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేపట్టే జపాన్ ప్రజలు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
సా«ధారణంగా వారుంటరే తెలుపు, అందులో మచ్చలేని చర్మం వారి సొంతం.అయితే, ఇప్పుడు ఓ కొత్త ప్రయోగం చేశారు.
అందులోను సక్సెస్ సాధించారు.అది నత్తలతో ఫేషియల్.
అదేంటి ప్రత్యేకంగా నత్తలతో ఫేషియల్ చేసుకోవడమేంటని ఆశ్చర్యంగా ఉంది కదా! ఇది కేవలం జపాన్ మాత్రమే కాదు స్వీడన్, జోర్డాన్ వంటి చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి.
సాధారణంగా చాలా మంది నత్తను చూస్తే భయపడతారు.దాని ఆకారం వాళ్లకు భయం కలిగిస్తుంది.
కానీ ఆ నత్తలు మనుషులకు చేసే మేలేంటో తెలిస్తే, ఆశ్చర్యం కలుగుతుంది.నత్తలు మన మోహం మీద అటూ ఇటూ తిరిగితే ముఖంపై ఉండే ముడతలు, గాయాలు, మొటిమలు ఇట్టే పోతాయట.
అంతేకాదు దీనివల్ల మొహం కూడా కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తారట.నత్తలతోనే ఎందుకు ఫేషియల్ చేయించాలంటే దీనికి ఓ ప్రత్యేకత ఉంది.
సాధారణంగా నత్తకు అంటే వాటి చిప్పకు ఏదైనా గాయమైనా, సమస్య వచ్చిన వాటంతట అవే నయం చేసుకునే గుణం ఉంది.
ఇలా అవి ఏవిధంగా నయం చేసుకుంటాయనే పరిశోధనలో నత్తలు జిగట పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయని తెలిసింది.
ఈ పదార్థం వల్లే అలా తమ ఆరోగ్యాన్ని, శరీరానికి ఏ సమస్యలు వచ్చినా నయం చేసుకోగలుగుతాయి.
"""/" /
దీంతో ఇప్పటికే ఆ జిగురు సాయంతో సబ్బులు కూడా తయారు చేస్తున్నారు.
నత్తలు స్రవించే జిగటలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉంటాయి.వీటికి గాయాలు నయం చేసే గుణం ఉంటుందని పరిశోధకులు చెప్పారు.
దీంతో ఇప్పటి వరకు నత్తలపై జరగని ప్రపంచవ్యాప్త పరిశోధనలు ఈ ప్రయోగంతో వాటిపై పరిశోధనలు ఊపందుకున్నాయి.
"""/" /
నత్తలు ఆఫ్రికాలో పెద్దవిగా ఉంటాయి.ఈ నత్తలను తీసుకువచ్చి.
మొహంపై అటూ ఇటూ పాకనిస్తున్నారు.దీనికి నత్తల ఫేషియల్ అని పేరు కూడా పెట్టారు.
జపాన్ వాసులు సాధారణంగానే ఎప్పుడూ యవ్వనంగా ఉండటానికి ఇష్టపడతారు.కేవలం జపాన్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత కాస్మొటిక్ కంపెనీలు ఈ నత్తల జిగురుపై దృష్టి సారించారు.
ఈ జిగురులోని కొల్లాజెన్ వల్ల యవ్వనంగా ఉండే తత్వం ఉంటుంది.అందుకే మరిన్ని కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేయటానికి సన్నధమవుతున్నాయి.
ఇక మనదేశంలో కూడా నత్తల ఫేషియల్ అందుబాటులోకి వస్తుందేమో చూద్దాం.
నేను ధనవంతురాలిని కాదు….నా దగ్గర సహాయం చేసేంత డబ్బు ఉంది: సాయి పల్లవి