2021లో సక్సెస్ ను కంటిన్యూ చేసిన టాలీవుడ్ దర్శకులు వీళ్ళే!

ప్రతి ఏడాది ఎంతో మంది దర్శకులు పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

ఇలా కొందరు దర్శకులు మంచి విజయాలను తమ ఖాతాలో వేసుకుంటే మరికొందరు మాత్రం బాక్సాఫీసు వద్ద చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ క్రమంలోనే గతంలో కొన్ని సినిమాల ద్వారా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని ఈ ఏడాది (2021) లోకూడా పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అదే విజయాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

మరి ఈ ఏడాది వారి సక్సెస్ ను కంటిన్యూ చేసిన ఆ దర్శకులు ఎవరు అనే విషయానికి వస్తే.

సుకుమార్: 2018 వ సంవత్సరంలో రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ద్వారా సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ సుకుమార్ ఈ ఏడాది "పుష్ప" సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.

"""/" / వేణు శ్రీరామ్: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 2017లో `ఎంసీఏ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. """/" / శేఖర్ కమ్ముల: 2017 వ సంవత్సరంలో ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డైరెక్టర్ ఈ సినిమాతో అందరిని ఫిదా చేశారు.

ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సాయిపల్లవి, నాగచైతన్య హీరోహీరోయిన్లుగా లవ్ స్టోరీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. """/" / రాహుల్ సాంకృత్యన్: 2018 సంవత్సరంలో టాక్సీవాలా చిత్రం ద్వారా మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ ఈ ఏడాది సాయి పల్లవి, కృతి శెట్టి, నాని కాంబినేషన్లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.కిషోర్ తిరుమల: చిత్ర‌ల‌హ‌రి ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కిషోర్ తిరుమల ఈ ఏడాది ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాతో కిషోర్ తిరుమల మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇలా ఈ ఏడాది డైరెక్టర్లు వారి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి వారి విజయ పరంపరను కొనసాగించారు.

రాత్రుళ్లు కంటి నిండా నిద్రపోవాలి అనుకుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!