బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్ తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
TeluguStop.com
రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే పిల్లలైనా, పెద్దలైనా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు స్కిప్ చేయరాదు.
ప్రతి రోజు టైమ్‌కు బ్రేక్ ఫాస్ట్‌ను తీసుకుంటే గనుక ఆరోగ్యం బాగుంటుంది.బరువు అదుపులో ఉంటుంది.
నీరసం, అలసట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.మధుమేహం, గుండె పోటు వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలని సూచిస్తుంటారు.
అయితే బ్రేక్ ఫాస్ట్‌ను తీసుకోవడం ఎంత ముఖ్యమో.హెల్తీ బ్రేక్ ఫాస్ట్‌ను తీసుకోవడం అంత కంటే ముఖ్యం.
చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌లో ఏవి పడితే అవి తింటుంటారు.ఆరోగ్యం గురించి ఆలోచించే వారైతే ఉడి కించిన గుడ్డు లేదా ఆమ్లెట్‌ను తీసుకుంటారు.
ఈ రెండూ ఆరోగ్యానికి మంచే చేస్తాయి.కానీ, కేలరీల పరంగా ఆమ్లెట్ మరియు ఉడి కించిన గుడ్డు మధ్య చాలా తేడా ఉంటుంది.
"""/" /
సాధారణంగా ఆమ్లెట్ వేయడానికి నూనె లేదా నెయ్యి వాడుతుంటారు.దాంతో ఉడికించిన గుడ్డు కంటే ఎక్కువ కేలరీలను ఆమ్లెట్ కలిగి ఉంటుంది.
పైగా అమ్లెట్ కాస్త ఎక్కువ కుక్ అయ్యిందంటే.అందులో ఉండే పోషకాలు సగం కరిగి పోతాయి.
అందుకే బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్ కంటే ఉడికించిన గుడ్డును తీసుకోవడం మంచి దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉడికించిన గుడ్డును బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.విటమిన్ డి లోపం ఏర్పడ కుండా ఉంటుంది.
ఎముకలు.దంతాలు దృఢంగా మారతాయి.
మెదడు పని తీరు మెరుగు పడుతుంది.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.
హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.మరియు రక్త హీనత దరి చేరకుండా ఉంటుంది.
అందుకే బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్ కంటే గుడ్డే వెర్రీ గుడ్.
ఎన్టీఆర్ కోసం అమీర్ ఖాన్.. నీల్ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం 2000 కోట్లు పక్కా!