వారెన్ బఫెట్ విజయ రహస్యాలు ఇవే…!

వారెన్ బఫెట్ అంటే తెలియని మనుషులుండరంటే అతిశయోక్తి కాదేమో.మొత్తం వ్యాపార సామ్రాజ్యానికి కింగ్ ఆయన.

ఈ రోజు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ ఎవరన్నా వున్నారు అంటే అది ఆయనే.

ఈ రోజు ఆయన 90వ వసంతంలోకి అడుగుపెట్టారు.బఫెట్ అతి పిన్న వయసులో అనగా.

11 సంవత్సరాల వయస్సులో మొదటి షేరును కొనుగోలు చేసి రికార్డు సృష్టించాడు.అలా మొదలైన అతని ప్రస్థానం నేటితో 6 లక్షల కోట్ల రూపాయలు (82.

6 బిలియన్ డాలర్లు)కు చేరింది.అవును.

వారెన్ బఫెట్ 11 సంవత్సరాల వయస్సులోనే స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి ప్రభంజనం సృష్టించాడు.

వారెన్ బఫెట్ ను స్టాక్ మార్కెట్ ప్రపంచానికి అతిపెద్ద కింగ్ మేకర్ గా పరిగణిస్తారు.

ఆయన పెట్టుబడి చిట్కాలను అనుసరించడం ద్వారా చాలా మంది ధనవంతులు అయ్యారు కూడా.

వారికి వారు తమని వారెన్ బఫెట్ కు ఏకలవ్య శిష్యులుగా చెప్పుకుంటూ ఉంటారు.

ఇకపోతే ఆయన ఇన్వెస్టర్ల కోసం ఎప్పుడూ పలు విధాలైన చిట్కాలు చెబుతూవుంటారు.అవేమిటో చూద్దాం.

ఆయన ఉద్దేశంలో, మీరు మార్కెట్ గురించి అర్థం చేసుకుంటేనే పెట్టుబడి పెట్టండి, లేదంటే దాని జోలికి పోకండి.

ఈ విషయంలో పుకార్లను ఊరికే నమ్మవద్దని ఆయన సలహా.షేర్ల విషయంలో పూర్తిగా పెద్ద పెట్టుబడికి బదులుగా, చిన్న పెట్టుబడులు పెట్టడం మంచిదని ఆయన అభిప్రాయం.

ఎక్కువకాలం, మెరుగైన డివిడెండ్ రికార్డులతో స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని బఫెట్ ఎప్పుడూ చెబుతుంటారు.

అలాగే స్టాక్ మార్కెట్లో మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ తక్కువ ధరలో లభిస్తుంటే వాటిలో పెట్టుబడి పెట్టడం మంచిదని బఫెట్ సూచిస్తుంటారు.

వారెన్ ఎక్కువగా సజెస్ట్ చేస్తున్న సూత్రం ఏంటంటే.దీర్ఘకాలిక స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ వుంటారు.

భారతీయుడు 2 రిలీజ్ కి అంత సిద్ధం…కానీ ఒక్కటే బాధ పెడుతుందా..